'కాంతార' హిందీ రీమేక్‌పై రిషబ్ షాకింగ్ కామెంట్స్

by Disha Web Desk 7 |
కాంతార హిందీ రీమేక్‌పై రిషబ్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా : ఇటీవల బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన చిత్రం 'కాంతార'. ఎలాంటి అంచనాల్లేకుండా చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. కన్నడంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేశారు. ఈ మేరకు భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుండగా.. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు చూపు తిప్పుకోవడం కష్టమంటున్నారు ప్రేక్షకులు. ఇక ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న రిషబ్.. లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

'కాంతార' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తే తాను పోషించిన పాత్రకు ఏ బాలీవుడ్ హీరో సెట్ అవుతారని అడగ్గా.. ఈ సినిమా హిందీలో రీమేక్ చేయకూడదని భావిస్తున్నట్లు తెలిపారు. 'ఇలాంటి పాత్రలు చేయాలంటే మూలాలు, సంస్కృతిపై నమ్మకముండాలి. హిందీ చిత్ర పరిశ్రమలో నేను అభిమానించే చాలా మంది పెద్ద నటీనటులు ఉన్నారు. కానీ ఈ సినిమాను రీమేక్ చేసే ఆసక్తి మాత్రం వారికి లేదు' అన్నారు. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు 20-30 రోజుల ముందు నుంచే తాను నాన్ వెజ్ తినడం మానేసినట్లు వెల్లడించాడు.

Also Read : samantha disease :సమంతను కలవనున్న నాగచైతన్య..? తోడుగా వెళ్లనున్న నాగార్జున?

Also Read : Prabhas అభిమానులను గట్టిగా హర్ట్ చేసిన చిట్టి

Next Story

Most Viewed