Prabhas అభిమానులను గట్టిగా హర్ట్ చేసిన చిట్టి

by Disha Web Desk 7 |
Prabhas అభిమానులను గట్టిగా హర్ట్ చేసిన చిట్టి
X

దిశ, సినిమా : యంగ్ హీరో సంతోష్ శోభన్, 'జాతి రత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'లైక్ షేర్ సబ్‌స్క్రైబ్'. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ టీజర్, ట్రైలర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ఇక ఇటీవలే హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌కు నేచురల్ స్టార్ నాని గెస్ట్‌‌గా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ప్రభాస్‌ అభిమానులను హర్ట్ చేసింది. 'జాతిరత్నాలు' సినిమా ట్రైలర్‌ను ప్రభాస్‌ అన్ననే విడుదల చేశాడు. అది పెద్ద హిట్‌ అయ్యింది. ఇప్పుడు ఈ చిత్ర ట్రైలర్‌ను కూడా ఆయనే రిలీజ్‌ చేశాడు. ఈ సినిమా కూడా పెద్ద హిట్‌ అవుతుంది' అని తెలిపింది. అయితే ఫరియా ప్రభాస్‌ను అన్న అని పిలవడం ప్రభాస్ ఫ్యాన్స్‌కు నచ్చలేదు. దీంతో మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ని పట్టుకుని అంతా మాట అంటావా.. ఎంతో మందికి క్రష్ అయిన డార్లింగ్‌ను అన్నా అంటావా అంటూ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

ఇవి కూడా చదవండి: సినిమాలోనే ఆయనకు భార్యను.. నిజజీవితంలో కాదు : అభినయ

Next Story

Most Viewed