స్వామి వివేకానందపై RGV వివాదాస్పద ట్వీట్

by Disha Web |
స్వామి వివేకానందపై RGV వివాదాస్పద ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: తన వ్యాఖ్యలు, ప్రవర్తన, వివాదాస్పద ట్వీట్‌లతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ మరోసారి వివాదాస్పద ట్వీట్ చేశాడు. నిన్న కొండగట్టులో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తన ప్రచార వాహనం వారాహికి పూజలు చేయించిన అనంతరం దానిపై నుంచి తొలి స్పీచ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదే ఫోటోను షేర్ చేసిన రామ్ గోపాల్ వర్మ తొలుత 'హిట్లర్ వాహనంపై స్వామి వివేకానంద' అంటూ కామెంట్ పెట్టారు. మరో ట్వీట్‌లో హిట్లర్, స్వామివివేకానంద ఇద్దరు పవన్ కుడి, ఎడమ కాలును లిక్(నాకడం) చేస్తారని అదే అతడి 'స్టార్ పవర్' అని సంచలన కామెంట్ పెట్టారు. వారాహిని సాక్రెడ్ పిగ్ అని ఆ ట్వీట్‌లో వర్ణించాడు. స్వామి వివేకానందను అవమానించడం పట్ల పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : వారాహిపై కామెంట్ల ఎఫెక్ట్.. రాంగోపాల్ వర్మను అరెస్ట్ చేయాలని ABVP డిమాండ్


Next Story