వారాహిపై కామెంట్ల ఎఫెక్ట్.. రాంగోపాల్ వర్మను అరెస్ట్ చేయాలని ABVP డిమాండ్

by Disha Web Desk 19 |
వారాహిపై కామెంట్ల ఎఫెక్ట్.. రాంగోపాల్ వర్మను అరెస్ట్ చేయాలని ABVP డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలవడం వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు వెన్నతో పెట్టిన విద్య. అక్కడి ఎలాంటి వివాదం లేకపోతే ఏదో ఒక కాంట్రావర్సీ క్రియేట్ చేసి వివాదంలో నిలుస్తారు. ఇటీవల జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార రథం వారాహి వాహనాన్ని పంది అంది అంటూ వర్మ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆలయంలో ఉంటే అది వారాహి అని.. అదే రోడ్డుపై ఉంటే అది పంది అని ట్విట్టర్ వేదికగా వర్మ చేసిన ట్వీట్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో దర్శకుడు రాంగోపాల్ వర్మపై గచ్చిబౌలి పీఎస్‌లో ఏబీవీపీ విద్యార్థులు ఫిర్యాదు చేశారు. వారాహి, పవన్ కల్యాణ్, స్వామి వివేకానందను కించేపర్చే విధంగా ట్విట్టర్‌లో ఆర్జీవీ పోస్టులు పెట్టారని కంప్లయింట్ చేశారు. రాంగోపాల్ వర్మను అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక పవన్ కల్యాణ్‌పై రాంగోపాల్ వర్మ చేసిన కామెంట్లపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి : స్వామి వివేకానందపై RGV వివాదాస్పద ట్వీట్


Next Story

Most Viewed