మళ్లీ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన ఆర్జీవీ! నెక్ట్స్ బాలయ్య బాబేనా..?

by Disha Web Desk 23 |
మళ్లీ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన ఆర్జీవీ! నెక్ట్స్ బాలయ్య బాబేనా..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా తరచూ వివాదాస్పద కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తారు. దర్శకుడు ఆర్జీవీ రూపొందిస్తున్న తాజా చిత్రం 'వ్యూహం'. ఏపీ రాజకీయాల ఇతివృత్తంగా ఆయన ఈ సినిమా తీస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబు, సోనియాగాంధీ పాత్రలపై హింట్ ఇచ్చిన ఆర్జీవీ.. తాజాగా ట్విట్టర్లో ఓ ఫొటోను పోస్ట్ చేస్తూ “ఇది ఎవరో కనుక్కోండి” అని ట్వీట్ చేశారు. ఆ ఫొటోలో ఉన్నది మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అరవింద్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వర్మ కంపెనీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆయన తరువాతి టార్గెట్ నందమూరి బాలకృష్ణ అని తెలుస్తోంది. 2004లో బాలకృష్ణ ఇంట్లో జరిగిన గన్ ఫైరింగ్ నేపధ్యంలో ఓ సినిమా చేయడానికి వర్మ రెడీ అవుతున్నాడని అంటున్నారు. అయితే ఇది కొంచెం వివాదాస్పదం అయ్యే అవకాశం ఉంది.

Click here for Ram Gopal Varma Twitter Post


Read more : రామ్ చరణ్ ధరించిన వాచ్ ఖరీదు అన్నీ కోట్లా..?

Next Story