Ram Charan ధరించిన వాచ్ ఖరీదు అన్నీ కోట్లా..?

by Disha Web Desk 9 |
Ram Charan ధరించిన వాచ్ ఖరీదు అన్నీ కోట్లా..?
X

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన ఇటీవలే తల్లిదండ్రులైన సంగతి విధితమే. జూన్ 23న ఉపాసన డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా ఉపాసన- చరణ్ బయటికి రాగానే మెగా ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. తర్వాత చెర్రీ మీడియా అడిగిన ప్రశ్నలకు ఎంతో సంతోషంగా బదులిచ్చాడు. అయితే ఆ సమయంలో చరణ్ స్టైలీష్ లుక్ డ్రెస్సింగ్, ముఖ్యంగా ఆయన పెట్టుకున్న వాచ్ అందరిని ఆకర్షించింది. ‘చరణ్ ధరించిన వాచ్ రిచర్డ్ మిల్లె బ్రాండ్. పారదర్శక డయల్, రబ్బరు పట్టీలను కలిగి ఉంది. ఈ వాచ్ ఖరీదు దాదాపు రూ.1.62 కోట్లు ఉంటుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

చెర్రీకి వాచేస్ అంటే చాలా ఇష్టం. కోట్లు పెట్టి ఎప్పుడూ.. రిచర్డ్ మిల్లె, యోహాన్ బ్లేక్, రోలెక్స్, పటేక్ ఫిలిప్, ఆర్‌ఎం 61-01 యోహాన్ బ్లేక్ రిచర్డ్ మిల్లె, RM029పాటెక్ ఫిలిప్ నాటిలస్ క్రోనోగ్రాఫ్, రాయల్ ఓక్ ఆఫ్షోర్ గ్రాండ్ ప్రిక్స్, రాయల్ ఓక్ ఆఫ్షోర్ లెబ్రాన్ జేమ్స్ వంటి ధర కలిగిన వాచ్‌లు కొంటూనే ఉంటారు.’ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వాచ్ గురించి నెట్టింట తెగ చర్చ జరుగుతోంది.

Read more : మళ్లీ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన ఆర్జీవీ! నెక్ట్స్ బాలయ్య బాబేనా..?

Next Story