Ravi Teja: రవితేజ ‘రావణాసుర’ టీజర్ రిలీజ్

by Disha Web Desk 10 |
Ravi Teja: రవితేజ ‘రావణాసుర’ టీజర్ రిలీజ్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో.. మాస్ రాజా రవితేజ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. తాజాగా అతను నటిస్తున్న ‘రావణాసుర’ సినిమాపై కూడా అభిమానుల అంచనాలు భారీగానే ఉన్నాయి. సుధీర్‌వర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ‌లో సుశాంత్ కూడా కీలక పాత్ర పోషించాడు. కాగా ఈ మూవీ నుంచి తాజాగా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. సాలిడ్ బ్యాక్‌గ్రౌండ్‌తో అసాధారణమైన విజువల్స్‌తో టీజర్ సూపర్‌గా ఉంది. రవితేజ, సుశాంత్‌ కూడా డిఫరెంట్ యాంగిల్ యాక్టింగ్‌తో కనిపిస్తున్నారు. మొత్తని టీజర్‌ను చాలా బాగా కట్ చేశారు. ఇందులో రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా కూడా నటిస్తున్నారు. ఇక ఈ యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ మూవీ 2023, ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి : Hero Akhil: ఏజెంట్ తర్వాత కొత్త ప్రాజెక్ట్‌ను లైనులో పెడుతున్న అఖిల్

Next Story

Most Viewed