‘నువ్వేం చెప్పావో నాకు బాగా అర్థమైంది’.. ఐశ్వర్య కామెంట్స్‌పై రష్మిక

by Disha Web Desk 17 |
‘నువ్వేం చెప్పావో నాకు బాగా అర్థమైంది’.. ఐశ్వర్య కామెంట్స్‌పై రష్మిక
X

దిశ, సినిమా: ఐశ్వర్య రాజేష్ ఇటీవల ‘పుష్ప’లో రష్మిక పాత్రపై భిన్నమైన కామెంట్స్ చేయడం.. ఆ తర్వాత వివాదాస్పదమవడంతో మళ్లీ ఐశ్వర్య వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ పూర్తి అంశంపై తాజాగా రష్మిక స్పందించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయం వెల్లడించిన రష్మిక.. ‘హాయ్ లవ్.. నేను ఇప్పటి వరకు ఈ విషయాన్ని గమనించలేదు. కానీ, నేను నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాను. మనల్ని మనం వివరించుకోవడానికి ఎలాంటి కారణాలు అవసరం లేదు. నీవు ఈ విషయంలో ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీపై నాకు ప్రేమ, గౌరవం ఉన్నాయి. ఎప్పటికీ ఉంటాయి. నీ ‘ఫర్హానా’ మూవీ చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్’ అంటూ విమర్శకుల నోర్లు మూయించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Read more:

ఒకరితో అన్నీ చేసి మరొకరిని పెళ్లాడిన టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా?

లో దుస్తులు లేకుండా మృణాల్ హాట్ షో.. పిక్స్ వైరల్


Next Story