‘కాంతార’పై రణ్‌వీర్ వివాదాస్పద కామెంట్స్.. ఎట్టకేలకు స్పందించిన రిషబ్ శెట్టి!

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-16 04:28:23  IST  )

బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh)ఇటీవల ఓ ఈవెంట్‌లో భాగంగా ‘కాంతార: చాప్టర్1’(Kantara: Chapter 1)పై పలు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

‘కాంతార’పై రణ్‌వీర్ వివాదాస్పద కామెంట్స్..  ఎట్టకేలకు స్పందించిన రిషబ్ శెట్టి!
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh)ఇటీవల ఓ ఈవెంట్‌లో భాగంగా ‘కాంతార: చాప్టర్1’(Kantara: Chapter 1)పై పలు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. గోవాలో జరిగిన ఇఫ్ఫీ వేడుకలో.. పంజర్లీ దేవతపై తీసిన పలు సీన్లను ఇమిటేట్ చేసి వివాదంలో చిక్కుకున్నాడు. దీనిపై తీవ్రమైన వ్యతిరేకత రావడంతో పాటు నెటిజన్లు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో రణ్‌వీర్ సింగ్ తన ఉద్దేశాన్ని తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని క్షమాపణలు చెప్పాడు. అయితే ఇదే ఈవెంట్‌లో ఉన్న రిషబ్ శెట్టి(Rishab Shetty) మాత్రం సైలెంట్‌గా ఉండిపోయారు. ఆ తర్వాత కూడా రణ్‌వీర్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించకపోవడం గమనార్హం. ఇన్ని రోజుల తర్వాత ఈ విషయంపై రిషబ్ శెట్టి రియాక్ట్ అయ్యారు.

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘‘కాంతారలాంటి సినిమా తీసేటప్పుడు సంస్కృతి, సంప్రదాయాలు పాప్ కల్చర్‌గా మారిపోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. ఇక చిత్ర నిర్మాతగా నేను ప్రతిదీ గౌరవప్రదంగా చిత్రీకరించాలి. వాటిని నిర్ధారించడానికి చాలా మంది పెద్దల మార్గదర్శకత్వం తీసుకున్నా. దేవతలపై మిమిక్రీ చేయడం నాకు కూడా అసౌకర్యాన్ని కలిగించింది. సినిమాలో చాలా భాగం సినిమాటిక్, నటనకు సంబంధించింది. అయినా కూడా దైవం అనేది సున్నితమైన అంశం. ఎక్కడికి వెళ్లినా, వేదికలపై దేవతలను అపహాస్యం చేయొద్దని నేను కోరుతున్నా. ఎందుకంటే ఇది భావోద్వేగాలతో ముడిపడిన విషయం’’ అని అన్నారు. ఇక ఈ కామెంట్స్ ఆయన రణ్‌వీర్‌ను ఉద్దేశించి అని అంతా చర్చించుకుంటున్నారు.

Read More..

భార్యకు కౌంటర్ ఇచ్చిన రణ్‌వీర్ సింగ్.. ఇద్దరి మధ్య గొడవలా.. హాట్ టాపిక్‌గా మారిన వ్యవహారం!

Next Story