- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భార్యకు కౌంటర్ ఇచ్చిన రణ్‌వీర్ సింగ్.. ఇద్దరి మధ్య గొడవలా.. హాట్ టాపిక్‌గా మారిన వ్యవహారం!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె(Deepika Padukone) గత కొద్ది కాలంగా 8గంటల పనిదినాల కోసం పోరాటం చేస్తోంది.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె(Deepika Padukone) గత కొద్ది కాలంగా 8గంటల పనిదినాల కోసం పోరాటం చేస్తోంది. కొద్ది కాలంపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె ఇటీవల కూతురు జన్మించగా.. సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. కానీ దర్శకనిర్మాతలకే పలు కండిషన్లు పెడుతుండటంతో అమ్మడు పేరు హాట్ టాపిక్‌గా మారింది. ఈమె కండిషన్ కారణంగా.. దీపికాను భారీ ప్రాజెక్ట్స్ నుంచి తొలగిస్తున్నారు. ఇటీవల ఆమెను స్పిరిట్, కల్కి-2 వంటి భారీ చిత్రాల కోసం సెలెక్ట్ చేసుకుని కండిషన్స్ పెట్టడంతో మరో హీరోయిన్‌ను తీసుకున్నారు. గత కొద్ది కాలంగా ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇక దీపికాకు కొందరు హీరోయిన్స్ సపోర్ట్‌గా నిలుస్తుంటే.. మరికొందరు మాత్రం ఆమెకు కౌంటర్లు వేస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, దీపికా పదుకొణె భర్త రణ్‌వీర్ (Ranveer Singh)8గంటల పనిపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయా? అందుకే ఇలా మాట్లాడాడా? అని అంతా పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.
అసలు విషయంలోకి వెళితే.. రణ్‌వీర్ సింగ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ధురంధర్’ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తోంది. కేవలం వారంలోనే రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. సినీ స్టార్స్ ప్రశంసలు అందుకుంటుంది. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రణ్‌వీర్ సింగ్ 8 గంటల పనిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘చాలాసార్లు ఇతర నటీనటులు వారి మేనేజ్‌మెంట్ వారు, ‘మీరు అందరినీ పాడు చేస్తున్నారు’ అని ఫిర్యాదు చేస్తారు. అందరూ, మీరు కొన్నిసార్లు 8 గంటల షిఫ్ట్‌లో 10-12 గంటల పాటు షూటింగ్ చేస్తారు.
అప్పుడు మీతో పాటు మేము కూడా అలాగే చేయాల్సి వస్తుంది' అని అంటారు. కానీ 8 గంటల్లో మన షూటింగ్ పూర్తి కావడం కష్టం. కాబట్టి ఇంకొంచెం ఎక్కువ సేపు షూటింగ్ చేయాల్సిందే. మంచి అవుట్‌పుట్ కోసం కష్టపడాలి కానీ ఇన్ని గంటలే చేయాలని కండిషన్ పెట్టుకోవద్దు. నేను దీన్ని ఒక వ్యాపార లావాదేవీలా చూసే భాగస్వామిని కాదు. నటనకే ప్రాధాన్యత ఇస్తాను’ అని చెప్పారు. ఇక ఈ కామెంట్స్ వైరల్ అవుతుండగా.. నెటిజన్లు దీపికా, రణ్‌వీర్ మధ్య గొడవలు వచ్చాయి కావచ్చని అందుకే ఇలా మాట్లాడారని గుసగుసలాడుకుంటున్నారు. ఈ వ్యవహారం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
Read More..
‘కాంతార’పై రణ్‌వీర్ వివాదాస్పద కామెంట్స్.. ఎట్టకేలకు స్పందించిన రిషబ్ శెట్టి!






