వివాదంలో రాణి ముఖర్జీ ‘మర్దాని-3’ మూవీ.. పోలీసుల హెచ్చరికలతో స్పందించి క్లారిటీ ఇచ్చిన టీమ్

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-07 07:07:09  IST  )

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణి ముఖర్జీ(Rani Mukerji) పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ శివాని శివాజీ రాయ్‌గా ‘మర్దాని 3’(Mardaani-3) చిత్రంతో వెండితెరపైకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.

వివాదంలో రాణి ముఖర్జీ ‘మర్దాని-3’ మూవీ.. పోలీసుల హెచ్చరికలతో స్పందించి క్లారిటీ ఇచ్చిన టీమ్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణి ముఖర్జీ(Rani Mukerji) పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ శివాని శివాజీ రాయ్‌గా ‘మర్దాని 3’(Mardaani-3) చిత్రంతో వెండితెరపైకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. మూడు నెలల వ్యవధిలో రహస్యంగా అదృశ్యమైన 93 మంది యువతుల కేసును ఛేదించే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. అభిరాజ్ మీనావాలా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జనవరి 30న విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. అంతేకాకుండా బారీ కలెక్షన్లు రాబడుతోంది. అయితే, ఈ మూవీ ప్రమోషన్ల కోసం సోషల్ మీడియాలో ‘ఢిల్లీలో భారీగా అమ్మాయిలు అదృశ్యం’ అంటూ తప్పుడు వార్తలు వచ్చి భయాందోళనలు సృష్టించడం ఇప్పుడు పెను వివాదానికి దారితీసింది. జనవరి మొదటి వారం రోజుల్లోనే ఢిల్లీలో 807 మంది అదృశ్యమయ్యారంటూ వైరల్ అయిన రిపోర్టులపై ఢిల్లీ పోలీసులు స్పందించారు.

ఈ వైరల్ పోస్టులన్నీ 'పెయిడ్ ప్రమోషన్'లో భాగంగానే జరుగుతున్నాయని, ప్రజల్లో అనవసర భయాందోళనలు కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. ఇక ఇదే కాన్సెప్ట్‌తో వచ్చిన ‘మర్దాని 3’ మూవీ మేకర్స్ అలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈనేపథ్యంలో.. తాజాగా, ఈ ఆరోపణలపై నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) అధికారిక ప్రకటన విడుదల చేస్తూ స్పష్టత ఇచ్చింది. తమ సంస్థ 50 ఏళ్లుగా ఎంతో నైతిక విలువలతో పనిచేస్తోందని, సినిమా ప్రమోషన్ కోసం సున్నితమైన అంశాలను వక్రీకరించి సెన్సేషనలైజ్ చేయలేదని వారు ఖండించారు. వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయని, అధికారులపై తమకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు.

అతనితో నాని హీరోయిన్ క్రేజీ ఫొటోస్.. చాలా క్యూట్‌గా ఉన్నారంటూ కామెంట్స్

Next Story