అతనితో నాని హీరోయిన్ క్రేజీ ఫొటోస్.. చాలా క్యూట్‌గా ఉన్నారంటూ కామెంట్స్

by I. Sairam |   (  Updated:2026-02-07 07:06:25  IST  )

టాలీవుడ్ హీరోయిన్ నివేదా థామస్(Niveda Thamos) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

అతనితో నాని హీరోయిన్ క్రేజీ ఫొటోస్.. చాలా క్యూట్‌గా ఉన్నారంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ నివేదా థామస్(Niveda Thamos) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘పెద్ద మనిషి’(Pedda Manishi) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ చిన్నది ‘నిన్ను కోరి’(Ninnu Kori) మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో ఈ చిన్నదానికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘జై లవకుశ’(Jai Lava Kusa), ‘వకీల్ సాబ్’(Vakeel Saab), ‘శాకిని డాకిని’(Shakini Dakini) వంటి సినిమాలతో హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ భామ ‘35 చిన్న కథ కాదు’ మూవీలో చాలా లావు అయి కనిపించింది.

అప్పట్లో స్లిమ్‌గా ఉండే ఈ చిన్నది ఒకేసారి లావు అయి కనిపించడంతో ఆమె ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్‌కు షాక్‌కు గురయ్యారు. అయితే ఆ సినిమా మంచి విజయం సాధించడంతో మళ్లీ వరుస ఆఫర్లతో బిజీ అయిపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ప్రజెంట్ ఈ భామ చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్‌లు లేనట్టు కనిపిస్తుంది. దీంతో సోషల్ మీడియాకే పరిమితమైంది. అక్కడ నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.

ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా నివేదా తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో తన తమ్ముడితో తీసుకున్న కొన్ని క్రేజీ ఫొటోలు పంచుకుంది. అతని షోల్డర్ పైన చేయి వేసి నవ్వుతూ, వెక్కిరిస్తూ ఉన్న పిక్స్‌ను షేర్ చేస్తూ.. ‘ది మెంటల్ బాయ్స్’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతోఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు సో గార్జియస్, క్యూట్ ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story