సినిమాల్లోకి రానా భార్య.. నా ట్యాలెంట్‌ ఏంటో చూపిస్తానంటూ క్లారిటీ ఇచ్చిన దగ్గుబాటి కోడలు

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-21 09:02:41  IST  )

నేను ఇండస్ట్రీలో రాను. నాకు నటీనటులన్నా, సినిమాలన్నా చాలా గౌరవం ఉంది. ఒకవేళ నేను ఈ రంగంలో పనిచేయాల్సి వచ్చినా, అది కేవలం కెమెరా వెనుక మాత్రమే ఉంటుంది.

సినిమాల్లోకి రానా భార్య.. నా ట్యాలెంట్‌ ఏంటో చూపిస్తానంటూ క్లారిటీ ఇచ్చిన దగ్గుబాటి కోడలు
X

దిశ, సినిమా: రానా దగ్గుబాటి భార్యగా మిహికా బజాజ్ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే. సినిమాల్లో నటించకపోయినప్పటికీ, సోషల్ మీడియాలో తనదైన ముద్ర వేసుకున్న మిహికాకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇంటీరియర్ డిజైనర్‌గా, బిజినెస్ ఉమెన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె, తరచూ సినిమా ఈవెంట్లలో కనిపిస్తుండటంతో త్వరలోనే వెండితెరపై ఎంట్రీ ఇస్తుందని పుకార్లు వినిపించాయి. ఈక్రమంలో.. తాజాగా, ఈ వార్తలపై మిహికా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. సినిమాల్లో నటిస్తారా? అన్న ప్రశ్నకు మిహికా చాలా క్లియర్‌గా సమాధానమిచ్చారు. "నేను ఇండస్ట్రీలో రాను. నాకు నటీనటులన్నా, సినిమాలన్నా చాలా గౌరవం ఉంది. ఒకవేళ నేను ఈ రంగంలో పనిచేయాల్సి వచ్చినా, అది కేవలం కెమెరా వెనుక మాత్రమే ఉంటుంది. డిజైనింగ్ రంగంలో నాకు ఉన్న ట్యాలెంట్‌ను అక్కడ చూపిస్తాను. కథలు చెప్పడం అనేది ఒక ప్రత్యేకమైన కళ, అది తెలిసిన వారే చేయాలి.. అది నా వల్ల కాదు" అని ఆమె తేల్చి చెప్పారు.

దీనితో మిహికా హీరోయిన్‌గా మారుతుందనే వార్తలకు చెక్ పడినట్లయింది. కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా, సామాజిక సేవలోనూ మిహికా ముందుంటున్నారు. మానసిక ఆరోగ్య సమస్యల పట్ల అవగాహన కల్పించడానికి ఆమె ‘ముదిత ట్రైబ్’ అనే ఎన్జీవోను ప్రారంభించారు అయితే దీనిని కొందరు 'మోడా' అని కూడా పిలుస్తున్నారు. అయితే అధికారికంగా ముదిత ట్రైబ్ అని ప్రసిద్ధి. కరోనా పాండమిక్ తర్వాత చాలా మంది మానసిక ఆందోళనలకు గురవుతున్నారని గమనించిన ఆమె, వారికి అండగా నిలవాలని ఈ నిర్ణయం తీసుకున్నారట. ‘ముదిత’ అంటే ఇతరుల సంతోషాన్ని చూసి మనం ఆనందించడం అని అర్థం. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ మానసిక ప్రశాంతతనిచ్చేలా వివిధ కార్యక్రమాలను ఈ సంస్థ నిర్వహిస్తోంది. రానా భార్యగానే కాకుండా, తనకంటూ ఒక స్వతంత్రమైన గుర్తింపును సంపాదించుకుంటున్న మిహికా నిర్ణయాలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

‘NBK-111’ లో సడెన్ ట్విస్ట్.. నయనతార ఔట్ బాలయ్య సరసన లక్కీ చాన్స్ కొట్టేసిన స్టార్ హీరోయిన్

Next Story