‘NBK-111’ లో సడెన్ ట్విస్ట్.. నయనతార ఔట్ బాలయ్య సరసన లక్కీ చాన్స్ కొట్టేసిన స్టార్ హీరోయిన్!

by Mallepaka Hamsa |

తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా స్క్రిప్ట్‌లో భారీ మార్పులు జరిగాయట. కథ మొత్తం మారిపోవడంతో, డేట్స్ సర్దుబాటు కాక నయనతార ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

‘NBK-111’ లో సడెన్ ట్విస్ట్.. నయనతార ఔట్ బాలయ్య సరసన లక్కీ చాన్స్ కొట్టేసిన స్టార్ హీరోయిన్!
X

దిశ, సినిమా: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలయ్య, తన తదుపరి చిత్రం కోసం మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో జట్టు కట్టారు. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బ్లాక్‌బస్టర్ కావడంతో, ఈ కొత్త సినిమా NBK 111 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిజానికి ఈ సినిమాను ఒక పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కించాలని మేకర్స్ భావించారు. ఇందులో హీరోయిన్‌గా నయనతార పేరును కూడా అధికారికంగా ప్రకటించారు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా స్క్రిప్ట్‌లో భారీ మార్పులు జరిగాయట. కథ మొత్తం మారిపోవడంతో, డేట్స్ సర్దుబాటు కాక నయనతార ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో బాలయ్య సరసన నటించే ఆ కొత్త హీరోయిన్ ఎవరనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

నయనతార ప్లేస్‌లో ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గోపీచంద్ మలినేని కాజల్‌ను సంప్రదించగా, ఆమె కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే బాలయ్య-కాజల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘భగవంత్ కేసరి’ భారీ విజయాన్ని అందుకుంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులకు బాగా నచ్చడంతో, సెంటిమెంట్ పరంగా కూడా కాజల్ అయితేనే కరెక్ట్ అని చిత్ర యూనిట్ భావిస్తోందట అందుకే ఆమెను ఫైనల్ చేసినట్లు టాక్. త్వరలోనే కాజల్ షూటింగ్‌లో కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబోకి తోడు, సక్సెస్‌ఫుల్ హీరోయిన్ కాజల్ కూడా తోడవ్వడంతో నందమూరి అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. ఒకవైపు దర్శకుడు, మరోవైపు హీరోయిన్.. ఇద్దరూ బాలయ్యకు గతంలో హిట్స్ ఇచ్చిన వారే కావడంతో, ఈ సినిమా హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అధికారిక వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి.

Next Story