‘రామబాణం’ క్లోజ్.. కనీసం పబ్లిసిటీకి పెట్టిన ఖర్చులు కూడా రాలేదు!

by Disha Web Desk 9 |
‘రామబాణం’ క్లోజ్.. కనీసం పబ్లిసిటీకి పెట్టిన ఖర్చులు కూడా రాలేదు!
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన రామాబాణం సినిమా ఇటీవలే విడులైన సంగతి తెలిసిందే. సుదీర్ఘ కాలంగా వరుస ప్లాపులతో బాధపడుతున్న హీరో గోపీచంద్ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తీరా విడుదలయ్యాక మొదటిరోజు నుంచే బాక్సాఫీస్ వద్ద నెగెటివ్ టాక్ తెచ్చుకున్నది. దీంతో సినిమా కలెక్షన్లపై భారీ ప్రభావం పడింది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సుమారు 15 కోట్ల రూపాయలకు అమ్ముకుందని సమాచారం.

అలాగే నిర్మాతలు ప్రమోషన్స్ కోసమే రూ.5 కోట్లు ఖర్చు పెట్టడం గమనార్హం. కానీ, ఇప్పటి వరకు ఈ సినిమాకు కేవలం రూ.4 కోట్లు మాత్రమే వచ్చాయి. కనీసం పబ్లిసిటీకి పెట్టిన డబ్బులను కూడా రాలేదని నిర్మాతలు అసహనంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి డిజాస్టర్ సినిమా గోపీచంద్ కెరీర్‌లోనే లేదని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఈ సినిమాలో గోపీచంద్ సరసన డింపుల్ హయాతీ నటించింది.

Read more:

భీమ్లానాయక్ ప్రొడ్యూసర్‌తో దుల్కర్‌ సల్మాన్ సినిమా!



Next Story

Most Viewed