RRR Star Ram Charan Roped In For Allu Arjun's Pushpa 2

by Disha Web Desk 10 |
RRR Star Ram Charan Roped In For Allu Arjuns Pushpa 2
X

దిశ, సినిమా : సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన తెలుగు సినిమాలకు ఆదరణ గతంకంటే ఇప్పుడు మరింత పెరిగింది. కొంత కాలంగా టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా చిత్రాలు రావడం, అవి దేశ వ్యాప్తంగా విజయం సాధించడం ఇందుకు కారణం..అలా వచ్చిన మూవీస్ లో 'పుష్ప ద రైజ్' ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయిందో తెలిసిందే. దీంతో 'పుష్ప 2' సినిమాను మరింత దిమ్మదిరిగేలా ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు సుకుమార్. తాజా సమాచారం ప్రకారం..ఈ సినిమాలో స్టార్ హీరో అయిన రామ్‌చరణ్ కలెక్టర్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడని ఓ ఆసక్తికర న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇక గతంలో ఈ ఇద్దరు హీరోలను కలిపి 'ఎవడు' సినిమాలో చూశాం. అలాగే, పుష్ప 2లో 'కేథరీన్ థెరీసా' కూడా ఓ నెగెటివ్ పాత్రలో నటిస్తోంది. అదే విధంగా ఈ సినిమాలో మరో సీనియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉందని, ఆ క్యారెక్టర్లో మనోజ్ బాజ్ పాయ్ నటించబోతున్నాడని తెలుస్తోంది. మొత్తానికి ఊహించని క్యారెక్టర్స్‌తో వస్తున్న ఈ 'పుష్ప 2' కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read more:

5 రూపీస్ కాయిన్ని నుంచి బ్లేడ్‌ను తయారు చేసారని మీకు తెలుసా ?

కొబ్బరి బోండాలు చూపిస్తూ కవ్విస్తున్న Janhvi Kapoor



Next Story