- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మలయాళ బ్యూటీ అందానికి ఫిదా అయిపోయిన రామ్ చరణ్.. చర్చనీయాంశంగా మారిన కామెంట్స్
టాలీవుడ్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్(Roshan) ‘రుద్రమదేవి’సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్(Roshan) ‘రుద్రమదేవి’సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత చేసిన ‘నిర్మలా కాన్వెంట్’పెద్దగా మెప్పించలేదు. 2021లో రోషన్, శ్రీలీల కాంబోలో వచ్చిన ‘పెళ్లి సందడి’ సినిమా బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో రోషన్ కనకాల ఫేమ్ ఒక్కసారిగా మరింత పెరిగింది. అయినప్పటికీ రోషన్ కొద్ది కాలంపాటు సినిమాలకు దూరం అయ్యాడు. మళ్లీ ‘ఛాంపియన్’(Champion) మూవీతో ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనస్వర రాజన్(Anaswara Rajan) హీరోయిన్‌గా కనిపించనుంది.
ఈ ప్రాజెక్ట్‌తో ఈ అమ్మడు తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతుండటం విశేషంజ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ప్రమోషన్స్‌లో భాగంగా ‘ఛాంపియన్’ట్రైలర్ లాంచ్ చేయగా.. ఈ ఈవెంట్‌కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)గెస్ట్‌గా హాజరయ్యారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. అనస్వరపై ప్రశంసలు కురిపించారు. ‘‘మీ ఫేస్ చాలా కళగా ఉంది. మీకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అన్నింటిని మించి చాలామంది దర్శక నిరంమాతలు మీ డేట్ల కోసం ఖచ్చితంగా పోటీ పడతారు.
ఈరోజుల్లో చాలామంది హీరోయిన్లు వాళ్ల పాత్రలకు డబ్బింగ్ చెప్పడం తగ్గించేశారు. కానీ ప్రియాంక కొద్దిసేపటి క్రితమే మీ గురించి చెప్పారు. మీరు మలయాళం అయినా కూడా తెలుగు నేర్చుకుని తెలుగులో డబ్బింగ్ చెప్పారు అని. నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అనస్వర’’ అని అన్నారు. ప్రజెంట్ రామ్ చరణ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రేక్షకుల దృష్టి అనస్వరపై పడింది. ఈ అమ్మడు వివరాలను తెలుసుకునేందుకు నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ చేసిన కామెంట్స్ నెట్టింట చర్చకు దారితీస్తున్నాయి.
Read More..
అతను హాలీవుడ్ హీరోలా ఉంటాడు: ఆ యంగ్ హీరోపై రామ్ చరణ్ క్రేజీ కామెంట్స్






