అతను హాలీవుడ్ హీరోలా ఉంటాడు: ఆ యంగ్ హీరోపై రామ్ చరణ్ క్రేజీ కామెంట్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-12-19 03:01:00  IST  )

రోషన్(Roshan), అనస్వర రాజన్(Anaswara Rajan) జంటగా నటిస్తున్న సినిమా 'ఛాంపియన్'(Champion).

అతను హాలీవుడ్ హీరోలా ఉంటాడు: ఆ యంగ్ హీరోపై రామ్ చరణ్ క్రేజీ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రోషన్(Roshan), అనస్వర రాజన్(Anaswara Rajan) జంటగా నటిస్తున్న సినిమా 'ఛాంపియన్'(Champion). ప్రదీప్ అద్వైత్(Pradeep Advaith) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ కాన్సెప్ట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, అర్చన కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన గిరగిర, సల్లంగుండాలే పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి.

అయితే ఈ మూవీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా గురువారం నిర్వహించిన ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కి అతిథిగా విచ్చేసిన రామ్‌చరణ్‌(Ram Charan) యంగ్ హీరో రోషన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చరణ్ మాట్లాడుతూ ‘రోషన్ చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. అయితే ఛాంపియన్ మూవీ పోస్టర్‌లో రోషన్ హాలీవుడ్ హీరోలా అండ్ యూరోపియన్ మోడల్ లాగా కనిపిస్తున్నాడు.

ఇందాకే శ్రీకాంత్(Hero Srikanth) అన్నయ్యని అడిగా.. నువ్వు రౌండ్‌గా ఉంటావు.. రోషన్ షార్ప్‌గా ఎలా అని.. ఏది ఏమైనా మా అన్నయ్య శ్రీకాంత్, వదిన ఊహలది మంచి మనసు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రామ్ చరణ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Read More..

మలయాళ బ్యూటీ అందానికి ఫిదా అయిపోయిన రామ్ చరణ్.. చర్చనీయాంశంగా మారిన కామెంట్స్

Next Story