- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుకార్లకు చెక్ పెట్టిన రామ్ చరణ్.. ‘పెద్ది’ వాయిదాపై క్లారిటీ
‘రాకాస’ చిత్ర బృందం తమ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘పెద్ది’ షూటింగ్ సెట్స్‌లో రామ్ చరణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ‘రాకాస’ టీమ్ చేస్తున్న వినూత్న ప్రమోషన్లను అభినందించిన చరణ్, తన సినిమా విడుదలపై ఒక కీలక ప్రకటన చేశారు.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’ విడుదలపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా పదే పదే వాయిదా పడుతోందన్న వార్తలు మెగా అభిమానులను కొంత ఆందోళనకు గురిచేశాయి. ముందుగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించినప్పటికీ, షూటింగ్ ఆలస్యం కారణంగా జూన్‌కు వాయిదా పడిందంటూ ప్రచారం జరిగింది. ముఖ్యంగా నిర్మాత ఎస్కేఎన్ ఒక సందర్భంలో మాట్లాడుతూ జూన్ విడుదలను ప్రస్తావించడంతో, ‘పెద్ది’ వాయిదా ఖాయమని అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే, ఈ గందరగోళానికి తెరదించుతూ స్వయంగా రామ్ చరణ్ రంగంలోకి దిగారు. తాజాగా ‘రాకాస’ చిత్ర బృందం తమ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘పెద్ది’ షూటింగ్ సెట్స్‌లో రామ్ చరణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ‘రాకాస’ టీమ్ చేస్తున్న వినూత్న ప్రమోషన్లను అభినందించిన చరణ్, తన సినిమా విడుదలపై ఒక కీలక ప్రకటన చేశారు. "పెద్ది మూవీ వాయిదా పడుతోందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.
మా సినిమా వాయిదా పడటం లేదని అందరికీ స్పష్టంగా తెలియజేయండి. ఆ పుకార్లకు అడ్డుకట్ట వేయండి" అని చరణ్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. రామ్ చరణ్ స్వయంగా క్లారిటీ ఇచ్చినప్పటికీ, నెటిజన్లలో మాత్రం ఇంకా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. సినిమా షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండటం, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయం పడుతుందన్న కారణాలతో ఏప్రిల్ 30 నాటికి సినిమా సిద్ధమవుతుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఏదేమైనా, గ్లోబల్ స్టార్ ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్ ప్రస్తుతం మెగా ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతి బాబు, దివ్యేందు శర్మ, శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.






