- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయ్–రష్మిక వల్ల ఫేమస్ అయిన ‘బడ్డీమూన్’ అంటే ఏంటో తెలుసా?
కొత్తగా పెళ్లైన జంట తమకు అత్యంత దగ్గరైన స్నేహితులతో కలిసి చేసే పోస్ట్ వెడ్డింగ్ ట్రిప్‌ను బడ్డీమూన్ అని అంటారు.

దిశ, వెబ్ డెస్క్: సాధారణ ప్రజలు సినీ సెలబ్రిటీలు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు. ముఖ్యంగా వారు ఏదైనా కొత్త యాక్టివిటీ చేస్తే, అది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌గా మారిపోతుంది. తాజాగా విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహ వేడుకలు చాలా రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగాయి. పెళ్లి అనంతరం ఈ జంట ‘బడ్డీమూన్’ అనే ప్రత్యేక ట్రిప్‌కు వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
దీంతో అసలు బడ్డీమూన్ ట్రిప్ అంటే ఏమిటి? అనే ఆసక్తి ప్రజల్లో పెరిగింది. సాధారణంగా కొత్తగా పెళ్లయిన జంట ఏకాంతంగా ఏదైనా ప్రదేశానికి వెళ్లి గడిపే ప్రయాణాన్ని హనీమూన్ అని అంటారు. అలాగే గర్భధారణ సమయంలో వెకేషన్‌కు వెళ్లడాన్ని బేబీమూన్ అని పిలుస్తారు. ఇక బడ్డీమూన్ అంటే, పెళ్లైన జంట తమకు అత్యంత దగ్గరైన స్నేహితులతో కలిసి చేసే పోస్ట్ వెడ్డింగ్ ట్రిప్‌ను బడ్డీమూన్ అని అంటారు. విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న కూడా తమకు అత్యంత సన్నిహితులైన స్నేహితులతో కలిసి బడ్డీమూన్ ట్రిప్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.
పుకార్లకు చెక్ పెట్టిన రామ్ చరణ్.. ‘పెద్ది’ వాయిదాపై క్లారిటీ






