జతకట్టనున్న రామ్ చరణ్, ప్రభుదేవా...!

by Disha Web Desk 9 |
జతకట్టనున్న రామ్ చరణ్, ప్రభుదేవా...!
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఆస్కార్ గ్రహీత రామ్ చరణ్, దర్శకుడు ప్రభుదేవ జతకట్టనున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవితో ఈ దర్శకుడు ‘‘శంకర్‌దాదా జిందాబాద్’’ సినిమా తెరకెక్కించాడు. కానీ, దురదృష్టవశాత్తూ ఆ చిత్రం అంతలా విజయం అందుకోలేకపోయింది. అయితే ఆ లోటును కుమారుడితో తీర్చుకోవాలని నిర్ణయించుకొన్నాడు. చరణ్‌తో మంచి కంటెంట్ ఉన్న సినిమాతో తెరపైకి తీసుకొచ్చి.. సూపర్ హిట్టు కొట్టి మెగాస్టార్‌కి, ప్రభుదేవా ట్రిబ్యూట్ ఇవ్వాలనుకుంటున్నారట. తాజాగా..చరణ్‌కు ఆయన ఓ కథ చెప్పడంతో చరణ్ బాగా నచ్చిందని అన్నారట. కానీ ప్రస్తుతం ఈ మెగా హీరో చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘శంకర్’ చిత్రం సెట్స్‌పై ఉంది. అలాగే మరో రెండు ప్రాజెక్టులు కూడా ఓకే అయ్యాయి. రేపో మాపో సెట్స్ మీదికి వెళ్లేందుకు రెడీగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ఇప్పట్లో జరగదు. కాస్త సమయం తీసుకున్న తప్పకుండా తెరపైకి సినిమా వస్తుందని సమాచారు.

Read more:

పవర్ స్టార్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊచకోత షురూ

Next Story

Most Viewed