పవర్ స్టార్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊచకోత షురూ..

by Vinod kumar |

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్.

పవర్ స్టార్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊచకోత షురూ..
X

దిశ, సినిమా: మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. తాజాగా ఈ చిత్రం షూటింగ్ ఆరంభమైనట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో పవన్.. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. పోలీస్ స్టేషన్‌లో పవన్ ఒక చైర్‌లో కూర్చొని, గన్‌తో.. ఇంకో చేత్తో టీ గ్లాస్‌ను పట్టుకొని ఉన్న పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అయితే ముఖం కనిపించకుండా వెనుక భాగాన్ని చూపించి ఆసక్తిని రేపారు.

ఈ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ లుక్‌ని తలపించేలా ఉంది. మొదటి నుండి ఈ క్రేజీ ప్రాజక్ట్ పై పవర్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట్ వైరల్‌గా మారింది.

Next Story