Puri Jagannadh : ఈ వెధవ అలవాటు ఆర్జీవీ వల్లే.. పూరి సంచలన కామెంట్స్

by Chukka Sudharani |   (  Updated:2023-08-20 16:32:07  IST  )

ప్రస్తుతం పూరి జగన్నాథ్ ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాతో బిజీగా ఉన్నాడు.

Puri Jagannadh : ఈ వెధవ అలవాటు ఆర్జీవీ వల్లే.. పూరి సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం పూరి జగన్నాథ్ ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. రామ్ పోతినేని హీరోగా వస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూరీ.. తన మందు అలవాటుకు ఆర్జీవినే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

‘మీరు డ్రగ్స్‌కు అడిక్ట్ అయ్యారా’ అని ఇంటర్వ్యూయర్ మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ని ప్రశ్నించగా.. దీనిపై స్పందిస్తూ ‘‘డ్రగ్స్‌కి అడిక్ట్ అయ్యింది లేదు. కానీ, మా గురువుగారు రామ్ గోపాల్ వర్మ పుణ్యమా అని గత మూడేళ్లుగా బాగా తాగుతున్నాను. ఇంతకు ముందు ఏదైనా పార్టీలో మందు బాటిల్ పట్టుకుని తాగినట్లు యాక్ట్ చేసేవాడ్ని. కానీ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి బాగా తాగడం నేర్చుకున్న. ఇదో వెధవ అలవాటు. గత మూడు సంవత్సరాలుగా ఇదే విధంగా చేస్తున్నా. ఆర్జీవీతో సరదాగా కూర్చుని రోజు తాగుతున్న’’ అంటూ చెప్పుకొచ్చాడు.

Read more : బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. భగవంత్ కేసరి అప్డేట్

Next Story