‘ప్రాజెక్ట్ కే’ టీ-షర్ట్ ఫ్రీగా కావాలా? వెంటనే మూవీ లోగోపై క్లిక్ చేయండి

by Dishanational2 |
‘ప్రాజెక్ట్ కే’ టీ-షర్ట్ ఫ్రీగా కావాలా? వెంటనే మూవీ లోగోపై క్లిక్ చేయండి
X

దిశ, సినిమా: ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రాజెక్ట్ కె’. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక కమల్‌హాసన్ విలన్‌గా నటించనుండటం ఈ ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తి కలిగిస్తోంది. దీంతో వచ్చే ఏడాది రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌ మొదలుపెట్టనుంది మూవీ టీమ్. ఈ మేరకు జూలై 20న ‘శాన్ డియాగో కామిక్ కాన్ 2023’ వేడుకలో ట్రైలర్ విడుదలతో పాటు టైటిల్‌ను రివీల్ చేయనున్నారు. ఇందులో భాగంగానే ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ‘ప్రాజెక్ట్ కే’ టీషర్ట్‌ను ఫ్రీగా అందజేస్తోంది వైజయంతి మూవీస్. మరి ఇంతకీ ఈ టీ షర్ట్ ఎలా పొందాలో చెబుతూ మూవీ ట్విట్టర్ అకౌంట్‌‌లో ఒక లింక్ షేర్ చేసింది. ఈ లింక్‌ను క్లిక్ చేయగానే ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇది ఎల్లో కలర్‌లో ఉంటే కంటిన్యూ బటన్ లేదా వైజయంతి మూవీస్ లోగోపై క్లిక్ చేసి పేరు, ఈమెయిల్ అడ్రస్ ఫిల్ చేయాలి. టీ షర్ట్ సైజు సెలెక్ట్ చేసుకావాలి. ఫస్ట్ డ్రాప్ పేరుతో శనివారం లింక్ విడుదల చేయగా 4 నిమిషాల్లోనే చాలా టీ షర్ట్‌లు సేల్ అయినట్లు సమాచారం. ఆదివారం సెకండ్ డ్రాప్ రిలీజ్ చేయనున్నారు.

Also Read: టాలీవుడ్ నిర్మాతలకు లోకల్ అమ్మాయిలు నచ్చట్లేదా? ఈషా రెబ్బా కామెంట్స్ వైరల్..

Next Story

Most Viewed