టాలీవుడ్ నిర్మాతలకు లోకల్ అమ్మాయిలు నచ్చట్లేదా? ఈషా రెబ్బా కామెంట్స్ వైరల్

by Dishanational2 |
టాలీవుడ్ నిర్మాతలకు లోకల్ అమ్మాయిలు నచ్చట్లేదా? ఈషా రెబ్బా కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు రానివాళ్లకే ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయంటోంది యంగ్ బ్యూటీ ఈషా రెబ్బా. త్వరలో అమోజాన్ ప్రైమ్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘దయా’లో జేడీ చక్రవర్తి సరసన నటించిన ఆమె ఈ సినిమా ప్రచారంలో భాగంగా యాక్షన్ సినిమాలు చేయాలనే కోరికతోనే ఈ మూవీ ఒప్పుకున్నట్లు తెలిపింది. అలాగే విభిన్న పాత్రల్లో నటించడమంటే తనకు చాలా ఇష్టమని, దానికోసం పలు రకాల శిక్షణలు కూడా తీసుకుంటున్నట్లు చెప్పింది. ఇక తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలిపింది. అలాగే తెలుగు భాష తెలియనివాళ్లకే ఎక్కువ అవకాశాలిస్తున్నారన్న నటి.. ప్రేక్షకులు డిమాండ్ చేయకపోయినా ఇతర రాష్ట్రాల అమ్మాయిలను ఎందుకు హీరోయిన్లుగా తీసుకుంటున్నారని మేకర్స్‌ను ప్రశ్నించింది. చివరగా తనకు ఎవరిపై వ్యక్తిగత కక్షలేదని, తన అభిప్రాయం మాత్రమే వెల్లడించినట్లు పేర్కొంది.

Also Read: ‘ప్రాజెక్ట్ కే’ టీ-షర్ట్ ఫ్రీగా కావాలా? వెంటనే మూవీ లోగోపై క్లిక్ చేయండి..


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed