‘రామాయణ’ సినిమా నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-27 06:08:42  IST  )

ఈ అద్భుతమైన ఇతిహాసాన్ని దాని అసలు స్ఫూర్తితో, అత్యంత చిత్తశుద్ధితో , గొప్ప స్థాయిలో వెండితెరపైకి తీసుకురావడానికి మేము ప్రతి అడుగు ఎంతో భక్తితో, శ్రద్ధతో వేశాము.

‘రామాయణ’ సినిమా నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ‘రామాయణ’ చిత్రం నుండి భారీ అప్‌డేట్ వచ్చింది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్‌ను పెట్టారు. ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి సందర్భంగా, ఈ చిత్రంలో శ్రీరాముడిగా నటిస్తున్న రణ్‌బీర్ కపూర్ అధికారిక ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను విడుదల చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఇన్నాళ్లూ లీక్ అయిన ఫోటోలతో సరిపెట్టుకున్న అభిమానులకు, ఈ ‘రామ’ గ్లింప్స్ ఒక అద్భుతమైన దృశ్యకావ్యంలా ఉండబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న బాధ్యతను గుర్తుచేస్తూ నమిత్ మల్హోత్రా ఎమోషనల్ అయ్యారు. "రామాయణం అనేది మనందరికీ చెందిన కథ. ఈ అద్భుతమైన ఇతిహాసాన్ని దాని అసలు స్ఫూర్తితో, అత్యంత చిత్తశుద్ధితో , గొప్ప స్థాయిలో వెండితెరపైకి తీసుకురావడానికి మేము ప్రతి అడుగు ఎంతో భక్తితో, శ్రద్ధతో వేశాము.

గత కొన్నేళ్లుగా మేము పడ్డ కష్టాన్ని ఒక గ్రాండ్ వరల్డ్ రివీల్ ద్వారా అభిమానులకు చూపించడానికి ఎదురుచూస్తున్నాం" అని ఆయన పేర్కొన్నారు. తమపై నమ్మకం ఉంచి, ఓపికగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ పోస్ట్ చూసిన సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. నితేష్ తివారీ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతమ్మగా నటిస్తుండగా.. కన్నడ స్టార్ యష్ రావణుడిగా కనిపిస్తున్నారు. ఈ చిత్ర యూనిట్ త్వరలోనే అమెరికాలో గ్రాండ్ ప్రమోషన్లను ప్రారంభించనుందని, టైమ్స్ స్క్వేర్ వంటి అంతర్జాతీయ వేదికలపై సినిమాను ప్రదర్శించనున్నారని సమాచారం. 8 సార్లు ఆస్కార్ గెలుచుకున్న DNEG సంస్థ సాంకేతిక సహకారంతో రూపొందుతున్న ఈ చిత్రం, మొదటి భాగం 2026 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా ఐమ్యాక్స్ (IMAX) ఫార్మాట్‌లో విడుదల కానుంది. ఇక సెకండ్ పార్ట్ మాత్రం వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేశారు.

Sai Pallavi: పెళ్లిపై బిగ్ ట్విస్ట్ ఇచ్చిన సాయి పల్లవి.. షాకింగ్ కామెంట్స్ వైరల్





Next Story