Sai Pallavi: పెళ్లిపై బిగ్ ట్విస్ట్ ఇచ్చిన సాయి పల్లవి.. షాకింగ్ కామెంట్స్ వైరల్

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-27 05:29:33  IST  )

ఒకవేళ నేను అర్థరాత్రి పూట ఏమీ తినకుండా ఏడుస్తూ కూర్చుంటే.. కేవలం మా అమ్మ మాత్రమే నాతో అలా కూర్చుంటుంది

Sai Pallavi: పెళ్లిపై బిగ్ ట్విస్ట్ ఇచ్చిన సాయి పల్లవి.. షాకింగ్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతోంది. అమరన్, తండేల్ వంటి చిత్రాలతో భారీ హిట్లు అందుకున్న ఈ భామ, ఇప్పుడు బాలీవుడ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘రామాయణ’లో సీతగా నటిస్తోంది. అయితే, కెరీర్ పరంగా ఎంతో ఎత్తులో ఉన్న సాయి పల్లవి, తన వ్యక్తిగత జీవితం, పెళ్లిపై చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవికి పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. దానికి ఆమె స్పందిస్తూ.. "నాకు పెళ్లిపై పెద్దగా మంచి అభిప్రాయం లేదు. విచిత్రం ఏంటంటే, పెళ్లైన వాళ్లే నన్ను పెళ్లి చేసుకోవద్దని చెబుతున్నారు. అందుకే ప్రస్తుతానికి నాకు ఆ ఆలోచన లేదు. నా పూర్తి ఫోకస్ సినిమాలపైనే ఉంది. నేను ఇప్పుడు సింగిల్‌గానే చాలా ప్రశాంతంగా ఉన్నాను" అని కుండబద్దలు కొట్టింది. ఈ మాటలు విన్న నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరికొందరు అయితే షాక్ అవుతున్నారు.

ఇదే ఇంటర్వ్యూలో సాయి పల్లవి ఓ షాకింగ్ విషయాన్ని కూడా బయటపెట్టింది. "ఒకవేళ నేను అర్థరాత్రి పూట ఏమీ తినకుండా ఏడుస్తూ కూర్చుంటే.. కేవలం మా అమ్మ మాత్రమే నాతో అలా కూర్చుంటుంది, ఇంకెవరూ కూర్చోలేరు" అని ఎమోషనల్ అయ్యింది. సాయి పల్లవికి ఇలా అర్థరాత్రి పూట ఏడుస్తూ కూర్చునే అలవాటు ఉందన్న విషయం తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. "ఇంత సక్సెస్‌లో ఉండి కూడా ఆమె మనసులో ఏదో బాధ ఉందా?" అని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్‌తో ‘ఏక్ దిన్’ చిత్రంతో పాటు, నితీష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న ‘రామాయణ’ మూవీలో సీత పాత్ర పోషిస్తోంది. వీటితో పాటు తమిళంలో ధనుష్ సరసన కూడా ఒక సినిమాకు సైన్ చేసినట్లు సమాచారం. పెళ్లిపై ఆసక్తి లేదని చెప్పిన ఈ ముద్దుగుమ్మ, సినిమాలతో మాత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూనే ఉంది. ప్రేక్షకులను మైమరిపిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది.

నిజంగా ఇది నమ్మశక్యం కానీ విషయం.. పెళ్లైన నెలరోజులకే రష్మిక ఎమోషనల్ పోస్ట్

Next Story