- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎవరి స్థానంలోకి రావడం లేదు.. సెన్సేషనల్ పాత్రతో వస్తున్నా: ప్రకాష్ రాజ్
అజయ్ దేవగన్(Ajay Devgan) హీరోగా, అభిషేక్ పాఠక్(Abhishek Pathak) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దృశ్యం 3’(Drishyam-3) షూటింగ్ ప్రారంభమైంది.

దిశ, సినిమా: అజయ్ దేవగన్(Ajay Devgan) హీరోగా, అభిషేక్ పాఠక్(Abhishek Pathak) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దృశ్యం 3’(Drishyam-3) షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా.. ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా ద్వారా ఆనందాన్ని పంచుకున్నారు. ‘‘దృశ్యం 3 వంటి అద్భుతమైన ఫ్రాంచైజీలో భాగమవ్వడం సంతోషంగా ఉంది. ఒక సెన్సేషనల్ రోల్ చేస్తున్నాను, కచ్చితంగా మీకు నచ్చుతుంది’’ అని రాశారు. అయితే, ఆయన ఎవరి స్థానంలోనూ రావడం లేదని, తనది ఒక ప్రత్యేకమైన పాత్ర అని స్పష్టం చేశారు. గత కొంతకాలంగా అక్షయ్ ఖన్నా ఈ సినిమా నుండి తప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఆయన స్థానంలోనే ప్రకాష్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈక్రమంలోనే పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఇక దీనిపై మూవీ నిర్మాత కుమార్ మంగత్ పాఠక్ క్లారిటీ ఇచ్చారు. అక్షయ్ ఖన్నా స్థానంలో వెర్సటైల్ యాక్టర్ జైదీప్ అహ్లావత్ నటిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ‘‘మేము జైదీప్ అహ్లావత్‌ను తీసుకున్నాము.
ఒక కొత్త క్యారెక్టర్‌ను యాడ్ చేశాము. అక్షయ్ ఖన్నా పోషించిన తరహా పాత్రనే జైదీప్ చేస్తారు. కానీ ఇది ఒక కొత్త రూపంలో, సరికొత్త పద్ధతిలో ఉంటుంది’’ అని నిర్మాత తెలిపారు. ఇక సైనింగ్ అమౌంట్ తీసుకుని, డేట్స్ ఇచ్చి కూడా అక్షయ్ ఖన్నా సినిమా నుంచి అర్థాంతరంగా తప్పుకున్నారంటూ నిర్మాత ఆయనకు లీగల్ నోటీసులు పంపారు. దీనిపై అక్షయ్ ఖన్నా నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. ప్రపంచవ్యాప్తంగా అంచనాలు పెంచుతున్న ‘దృశ్యం 3’ చిత్రాన్ని 2026 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అజయ్ దేవగన్ తన పాత పాత్రలోనే కనిపిస్తుండగా, జైదీప్, ప్రకాష్ రాజ్ చేరికతో ఈ థ్రిల్లర్ మరింత పవర్‌ఫుల్‌గా మారనుంది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లలో అంచనాలు పెరగడంతో పాటు.. ఆసక్తి నెలకొంది.






