తెలుగువాళ్లు అందరూ నన్ను తమ వాడిలా చూస్తారు.. హీరో అర్జున్ ఎమోషనల్

by Gugulothu.Kavitha |   (  Updated:2026-02-11 08:12:34  IST  )

కన్నడ హీరో అర్జున్‌ సర్జా (Arjun Sarja) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

తెలుగువాళ్లు అందరూ నన్ను తమ వాడిలా చూస్తారు.. హీరో అర్జున్ ఎమోషనల్
X

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ హీరో అర్జున్‌ సర్జా (Arjun Sarja) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆయన కేవలం హీరోగానే కాకుండా దర్శకుడిగానూ నిరూపించుకున్నారు. అలా మంచి గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ కొంత గ్యాప్‌ తర్వాత దర్శకత్వం వహించిన చిత్రం ‘సీతాపయనం’ (Seetha Payanam). ఈ సినిమా ద్వారా ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్(Aishwarya Arjun) హీరోయిన్‌గా పరిచయమవుతుండ‌గా.. కన్నడ స్టార్ ఉపేంద్ర మేనల్లుడు నిరంజన్ సుధీంద్ర(Niranjan Sudhindra) ఈ చిత్రంలో కథానాయకుడిగా న‌టిస్తున్నాడు.

ఈ చిత్రంలో సత్యరాజ్(Sathyaraj), ప్రకాష్ రాజ్(Prakash Raj), కోవై సరళ(Kovai Sarala) వంటి సీనియ‌ర్ న‌టులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా.. అర్జున్ సర్జా ఒక పవర్ ఫుల్ పాత్రలో మెరుస్తున్నాడు. ఆయన మేనల్లుడు ధ్రువ సర్జా(Dhruva Sarja) స్పెషల్ కామియో రోల్‌లో క‌నిపించ‌బోతున్నాడు. మెలోడీ కింగ్ అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం అందించాడు. అయితే ఈ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన అర్జున్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఆయన మాట్లాడుతూ.. ‘నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 46 ఏళ్లు.. తెలుగు ఇండస్ట్రీకి వచ్చి 42 ఏళ్లు అయింది. ‘మాపల్లెలో గోపాలుడు’(Maa Pallelo Gopaludu) నుంచి తెలుగు ప్రేక్షకులు అందరూ నన్ను తమ వాడిలా చూస్తారు. ఎక్కడ కనిపించినా నువ్వు కన్నడ వాడివా, మేము తెలుగోడు అనుకున్నాం అనేవారు. నా సినిమాలన్ని చూసి ఆదరించేవారు. ఇదే ప్రేమతో ఈ సినిమాను కూడా ఆదరిస్తారని భావిస్తున్నాను’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

నా భార్య ‘బద్రీనాథ్’ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేసింది.. మురళి శర్మ షాకింగ్ కామెంట్స్

Next Story