- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా భార్య ‘బద్రీనాథ్’ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేసింది.. మురళి శర్మ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్‌లో ఏ హీరోకైనా తండ్రి పాత్ర అంటే మనకు గుర్తొచ్చే మొదటి పేరు మురళీ శర్మ(Murali Sharma).

దిశ, సినిమా: టాలీవుడ్‌లో ఏ హీరోకైనా తండ్రి పాత్ర అంటే మనకు గుర్తొచ్చే మొదటి పేరు మురళీ శర్మ(Murali Sharma). క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా తనదైన ముద్ర వేసిన ఆయన.. ఎంత బిజీగా ఉంటారో అందరికీ తెలిసిందే. అయితే, మురళీ శర్మ వ్యక్తిగత జీవితం వెనుక ఒక ఆసక్తికరమైన ప్రేమకథ ఉందన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు. తాజాగా ఆయన పంచుకున్న విశేషాలు ఇప్పుడు సినీ ప్రియులను ఆశ్చర్యపరుస్తున్నాయి. మురళీ శర్మ భార్య కూడా చిత్ర పరిశ్రమలో ఒక పవర్‌ఫుల్ నటి. ఆమె మరెవరో కాదు, తన నటనతో గుర్తింపు తెచ్చుకున్న అశ్విని కల్ శేఖర్(Ashwini Kal Shekhar). ఆమెను మనం ఎన్నో సినిమాల్లో చూశాం కానీ, ఆమె మురళీ శర్మ భార్య అని మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. ‘‘నా భార్య అశ్విని కూడా నటినే. అల్లు అర్జున్ ‘బద్రీనాథ్’ సినిమాలో తమన్నా అత్తగా క్రూరమైన విలన్ పాత్రలో నటించింది. అలాగే మాస్ రాజా రవితేజ సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించింది’’ అని మురళీ శర్మ గర్వంగా చెప్పుకొచ్చారు.
మురళీ శర్మ తన పెళ్లి గురించి చెబుతూ.. ‘‘మాది లవ్ మ్యారేజ్. నాకు కేవలం 20 ఏళ్లు ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నాను’’ అని బాంబ్ పేల్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక మహారాష్ట్రకు చెందిన అశ్వినితో ఆయన ప్రేమలో పడటం, కెరీర్ ప్రారంభంలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టడం విశేషం. రెండు దశాబ్దాలకు పైగా వీరి బంధం ఎంతో అన్యోన్యంగా సాగుతోంది. ఒకరు వెండితెరపై తండ్రి పాత్రలతో మెప్పిస్తుంటే, మరొకరు లేడీ విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ ఒకే వృత్తిలో ఉంటూ, అటు వెండితెరపై.. ఇటు బుల్లితెరపై బిజీగా ఉంటూనే తమ వ్యక్తిగత జీవితాన్ని ఎంతో అందంగా మలుచుకున్నారు. మనందరికీ తెలిసిన మురళీ శర్మ వెనుక ఇంతటి బలమైన తోడు ఉందన్న విషయం తెలిసి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






