- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షారుఖ్ ఈజ్ బ్యాక్: 'పఠాన్'పై ప్రకాశ్‌రాజ్ ప్రశంసలు!
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ 'పఠాన్' బృందాన్ని తనదైన స్టైల్‌లో ప్రశంసించాడు.

X
దిశ, సినిమా: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ 'పఠాన్' బృందాన్ని తనదైన స్టైల్‌లో ప్రశంసించాడు. జనవరి 25న సినిమా విడుదలైన తర్వాత షారుఖ్ అండ్ టీమ్‌ను పొగుడుతూ ట్వీట్ చేసిన ఆయన.. 'షారుఖ్ ఈజ్ బ్యాక్' అంటూ ఆకాశానికెత్తేశాడు. అలాగే తన పోస్ట్‌కు 'బేషరమ్ రంగ్' అనే హ్యాష్‌ట్యాగ్ జోడించిన ప్రకాశ్.. 'హే బాయ్‌కాట్ బిగ్గాట్స్. ష్‌ష్‌ష్. హల్లా బోల్ (మీ గొంతు పెంచండి) కింగ్ ఖాన్.. షారుఖ్ ఖాన్ తిరిగి వచ్చాడు. కీప్ రాకింగ్ దీపికా పదుకొనే, జాన్ అబ్రహం అండ్ 'పఠాన్' టీమ్' అంటూ సంతోషంగా రాసుకొచ్చాడు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ట్వీట్‌పై స్పందిస్తున్న ఫ్యాన్స్.. 'ఇతరుల విజయాలను తనదిగా భావించే ఏకైక నటుడు, రాజకీయ నాయకుడు, కార్యకర్త ప్రకాష్ రాజ్ మాత్రమే' అంటూ మద్దతుగా నిలుస్తున్నారు.
ఇవి కూడా చదవండి : 'పఠాన్' కోసం థియేటర్‌లో కొట్టుకున్న యువకులు!
Next Story






