'పఠాన్' కోసం థియేటర్‌లో కొట్టుకున్న యువకులు!

by Mahesh |
పఠాన్ కోసం థియేటర్‌లో కొట్టుకున్న యువకులు!
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే జంటగా తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ 'పఠాన్'. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 8000 థియేటర్స్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఒక ఇండియన్ సినిమా భారీ స్థాయి థియేటర్స్‌లో రిలీజ్ అవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. అయితే ముందు నుంచి ఈ మూవీ తీవ్ర వివాదాల్లో చిక్కుకుంది. రీసెంట్‌గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ జిల్లాలో ఈ సినిమా చూస్తూ కొంతమంది యువకులు థియేటర్‌లో గొడవపడ్డారు. మూవీలోని 'బేషరమ్ సాంగ్ పై వారి మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ గొడవకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది. సంఘటన తెలుసుకున్న పోలీసులు 9 మందిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

ఇవి కూడా చదవండి: 'ఏజెంట్' రిలీజ్ డేట్‌పై వీడని సస్పెన్స్?

Next Story

Most Viewed