- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైన్స్ ఫిక్షన్ దారిలో ప్రదీప్.. కెరీర్ క్లిష్ట దశలో ఉన్న దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా?
వెంకట్ ప్రభు దర్శకత్వంలో ప్రదీప్ ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా చేయబోతున్నాడని టాక్. ఇప్పటికే వెంకట్ ప్రభు చెప్పిన కథకు ప్రదీప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని టాక్.

దిశ, సినిమా: ‘లవ్ టుడే’ వంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్‌తో స్టార్‌డమ్ అందుకున్న ప్రదీప్ రంగనాథన్, ఆ తర్వాత కూడా డ్రాగన్, డ్యూడ్ వంటి చిత్రాలతో తన జోరును కొనసాగించాడు. అయితే, ఇటీవల ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘లవ్ ఇన్యూరెన్స్ కంపెనీ’ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీనివల్ల ప్రదీప్ తదుపరి సినిమాల ఎంపికపై అందరి దృష్టి పడింది. ఈక్రమంలో.. తాజాగా, ప్రదీప్ రంగనాథన్‌కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలు హిట్ అయినప్పటికీ ఇటీవల ఓ పరాజయాన్ని చవిచూసిన దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ప్రదీప్ ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా చేయబోతున్నాడని టాక్. ఇప్పటికే వెంకట్ ప్రభు చెప్పిన కథకు ప్రదీప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని సమాచారం. ప్రదీప్ కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్న ఈ తరుణంలో, వరుస ఫ్లాపుల్లో ఉన్న వెంకట్ ప్రభుతో జత కట్టడంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మామూలుగానే ప్రదీప్ తనదైన శైలి కథలతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు, ఇప్పుడు ఇలాంటి సమయంలో ఇలాంటి ప్రయోగం అవసరమా? అని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. ఒకవేళ ఈ సినిమా కనుక హిట్ కాకుంటే, ప్రదీప్ కెరీర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.
ధనుష్ నిర్మాణంలో మృణాల్.. చర్చనీయాంశంగా మారిన మూవీ మేకర్స్ పోస్ట్.. ప్రేమ నిజమేనా?






