ధనుష్ నిర్మాణంలో మృణాల్.. చర్చనీయాంశంగా మారిన మూవీ మేకర్స్ పోస్ట్.. ప్రేమ నిజమేనా?

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-20 15:30:39  IST  )

ధనుష్ సొంత బ్యానర్ వండర్ బార్, ప్రైమార్క్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఒక లేడీ ఓరియెంటెడ్ చారిత్రక చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ధనుష్ నిర్మాణంలో మృణాల్.. చర్చనీయాంశంగా మారిన మూవీ మేకర్స్ పోస్ట్.. ప్రేమ నిజమేనా?
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. వరుసగా భారీ ప్రాజెక్టులను లైన్లో పెడుతూ నటుడిగా, దర్శకుడిగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే ‘కర’ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న ధనుష్, తాజాగా మరో ఆసక్తికరమైన నిర్మాణ బాధ్యతను చేపట్టారు. తన సొంత బ్యానర్ వండర్ బార్, ప్రైమార్క్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఒక లేడీ ఓరియెంటెడ్ చారిత్రక చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి రమేష్ నందన్ దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ నటించనున్నారనే వార్త ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పటికే మృణాల్ ఈ సినిమా కోసం లుక్ టెస్ట్ కూడా పూర్తి చేసుకున్నారని, చిత్రబృందం ఆమెను అధికారికంగా ఫైనల్ చేసిందని సమాచారం.

అయితే ధనుష్, మృణాల్ ఠాకూర్ ప్రేమలో ఉన్నారంటూ గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. వీటిపై వారు ఎన్నిసార్లు స్పందించినా, పుకార్లు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఈ కొత్త సినిమా ప్రకటనతో, మళ్ళీ ఆ వార్తలు తెరపైకి వచ్చాయి. కేవలం తమ మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్లే ధనుష్ ఈ సినిమాలో మృణాల్‌ను తీసుకున్నారని, మేకర్స్‌కు కూడా ఆమె పేరును ఆయనే సూచించారని కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా, ధనుష్ నిర్మాణంలో మృణాల్ ఠాకూర్ చేస్తున్న ఈ చారిత్రక చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం నిజమా లేక కేవలం వృత్తిపరమైన బంధమేనా అనేది పక్కన పెడితే, వీరి కలయికలో రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో మాత్రం ఆసక్తిని పెంచింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి.

వీధులు గుర్తుపెట్టుకునే పేరు ‘కేడి’.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్

Next Story