వీధులు గుర్తుపెట్టుకునే పేరు ‘కేడి’.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్!

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-20 15:18:06  IST  )

ఎన్నో అడ్డంకులను దాటుకుని, ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు.

వీధులు గుర్తుపెట్టుకునే పేరు ‘కేడి’.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్!
X

దిశ, సినిమా: కన్నడ యాక్షన్ స్టార్ ధృవ సర్జా హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘కేడి: ది డెవిల్’ ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విజువల్స్, యాక్షన్ పరంగా హాలీవుడ్ రేంజ్‌లో కనిపిస్తున్న ఈ సినిమా, షూటింగ్ మొదలైనప్పటి నుండి ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన ఒక మాస్ సాంగ్ పెద్ద దుమారమే రేపింది. ఇందులో బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి డ్యాన్స్ చేయగా, సంజయ్ దత్ కూడా కనిపించారు. అయితే, ఈ పాటలో వాడిన కొన్ని పదాలు అసభ్యకరంగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. నోరా మరియు సంజయ్ దత్ వంటి స్టార్లపై నెటిజన్లు పెదవి విరిచారు. అయినప్పటికీ, చిత్ర బృందం వీటిని తట్టుకుని సినిమాను పూర్తి చేసింది. ఎన్నో అడ్డంకులను దాటుకుని, ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగానే అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్‌ను ఏప్రిల్ 22న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. "ప్రతి యుగంలోనూ, వీధులు ఎప్పటికీ మరువలేని ఒక పేరు ఉంటుంది.. ట్రైలర్ వస్తోంది, అస్సలు మిస్ అవ్వకండి" అంటూ ఇచ్చిన క్యాప్షన్ సినిమాపై హైప్‌ను పెంచేసింది. ఈ సినిమాలో ధృవ సర్జా సరసన నానయ్య హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, రమేష్ అరవింద్, శిల్పా శెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పాన్ ఇండియా లెవల్‌లో విడుదల కాబోతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్.. పవర్ ఫుల్ పాత్రతో నాగబాబు రీఎంట్రీ

Next Story