సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్.. పవర్ ఫుల్ పాత్రతో నాగబాబు రీఎంట్రీ!

by Mallepaka Hamsa |

కొంతకాలం విరామం తర్వాత నాగబాబు ఇప్పుడు ‘క్యాస్ట్’ అనే సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించబోతున్నారు

సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్.. పవర్ ఫుల్ పాత్రతో నాగబాబు రీఎంట్రీ!
X

దిశ, సినిమా: మెగా బ్రదర్ నాగబాబు మళ్లీ వెండితెరపై మెరవడానికి సిద్ధమయ్యారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి మెప్పించిన ఆయన, గత కొంతకాలంగా రాజకీయాల్లో బిజీగా ఉంటూ సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. అయితే, కొంతకాలం విరామం తర్వాత ఆయన ఇప్పుడు ‘క్యాస్ట్’ అనే సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన నాగబాబు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఆయన అయ్యప్ప స్వామి మాలలో కనిపిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో ఆయన ‘రంగరాజన్’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు మూవీ టీమ్ వెల్లడించింది. చాలా కాలం తర్వాత నాగబాబు ఒక విలక్షణమైన పాత్రతో రాబోతుండటంతో మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ పోస్టర్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. కాగా.. ఏకే జంపన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ సందేశ్, సత్యం రాజేష్, గగన్ మరియు యాంకర్ రవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా నాగబాబు కెరీర్‌లో ఒక స్పెషల్ మూవీగా నిలుస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ, నాగబాబు మళ్లీ సినిమాల వైపు మొగ్గు చూపడం ఆసక్తికరంగా మారింది. మరి ఈ ‘రంగరాజన్’ పాత్రతో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.

Next Story