ఎస్‌కేఎన్‌ను చెడుగుడు ఆడుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్.. దొరికితే నీకు మాములుగా ఉండదంటూ వార్నింగ్

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-09 07:09:49  IST  )

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మారుతి(maruthi) కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’(the rajasaab).

ఎస్‌కేఎన్‌ను చెడుగుడు ఆడుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్.. దొరికితే నీకు మాములుగా ఉండదంటూ వార్నింగ్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మారుతి(maruthi) కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’(the rajasaab). హారర్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మించారు. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. అయితే భారీ అంచనాల మధ్య జనవరి 9న విడుదలై.. బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంటుంది. ఈ సినిమా చూసిన వారంతా తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. అయితే స్క్రీన్ ప్లే బాగా లేదని, ఫస్ట్ హాఫ్ స్లోగా ఉందని, సాంగ్స్ అనవసరం అనిపిస్తుంటాయని, స్టోరీ టెల్లింగ్ వీక్ గా ఉందని, స్టోరీ కూడా బోరింగ్‌గా ఉందని కామెంట్లు పెడుతున్నారు. ఇక ప్రభాస్ అభిమానులు మాత్రం నిర్మాత ఎస్‌కేఎన్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

దానికి కారణం సినిమా విడుదలకు ముందు.. ఆయన పలు కామెంట్లు చేయడమే.. సినిమా డిజప్పాయింట్ చేస్తే ఇంటికొచ్చి తిట్టమని చెప్పిన డైరెక్టర్ మారుతీని.. '3 గంటల 10 నిమిషాల మాస్ ధమాకా, రాసిపెట్టుకోండి' అంటూ ఓవర్ హైప్ ఇచ్చిన నిర్మాత SKN నెట్టింట చెడుగుడు ఆడుకుంటున్నారు. ఎక్కడికి వెళ్లినా సూపర్ హిట్ అవుతుందని చెప్పావుగా.. ఎక్కడున్నావ్ చెప్పరా.. మాకు నువ్వు దొరికితే నీకు మామూలుగా ఉండదు అంటూ వార్నింగ్ ఇస్తున్నారు.అలాగే ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తూ.. ఎస్‌కేఎన్‌ను పొట్టు పొట్టు తిడుతున్నారు. మొత్తానికి ‘ది రాజాసాబ్’ సినిమాకు వచ్చిన మిక్స్‌డ్ టాక్‌తో పాటు, విడుదలకు ముందు ఇచ్చిన ఓవర్ హైప్ కారణంగా నిర్మాత ఎస్‌కేఎన్ నెట్టింట ట్రోల్స్‌కు గురవడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

link

Read More..

ఎంతైనా డార్లింగ్ ఫ్యాన్స్ తో మామూలుగా ఉండదు!

Next Story