- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంతైనా డార్లింగ్ ఫ్యాన్స్ తో మామూలుగా ఉండదు!
రాజాసాబ్ సినిమా విడుదల నేపథ్యంలో అభిమానుల సందడి.

దిశ, వెబ్ డెస్క్ : కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అంటూ.. రెబల్ స్టార్ ప్రభాస్ ఓ సినిమాలో చెప్పిన డైలాగ్ ఆయన విషయంలో నిజమే అనిపిస్తుంది. ఆయన కటౌట్ కు తగినట్లే అభిమానులు కూడా ఉంటారు. సాహో సినిమాలో ఫ్యాన్స్ కాదు.. డైహార్డ్ ఫ్యాన్స్ అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ ఆయన ఫ్యాన్స్ విషయంలో కొన్నిసార్లు నిజమవుతూ ఉంటుంది. అలాంటి కొన్ని ఘటనలు డార్లింగ్ నటించిన రాజాసాబ్ సినిమా రిలీజ్ సమయంలో కనిపించాయి. సినిమా రిలీజ్ కావడంతో డార్లింగ్ ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. కొందరు బైకులపై స్టంట్లు చేస్తే.. మరికొందరు థియేటర్ల వద్ద భారీ కటౌట్లను ఏర్పాటు చేసి తమ అభిమానం చాటుకున్నారు. మరికొందరు టపాసులు కాల్చి కెవ్వు కేక పుట్టించారు. అయితే ఇంకొందరి అభిమానం కాస్త ఇబ్బందికరంగా మారిన ఒకటి రెండు ఘటనలు కూడా వెలుగు చూశాయి.
వాటిల్లో ఒకటి హైదరాబాద్ లోని బాలానగర్ లో ఉన్న విమల్ థియేటరులో జరిగింది. మీడియా ప్రతినిధుల కోసం అక్కడ ప్రీమియర్ షోను ఏర్పాటు చేయగా.. పెద్ద ఎత్తున ఫ్యాన్స్ కూడా అక్కడకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. థియేటర్ యాజమాన్యం ఎంత నచ్చ చెప్పాలని చూసినా వారి అభిమానం వారిని యాజమాన్యం మాట వినిపించుకోనివ్వలేదు. దీంతో కాసేపు గందరగోళం నెలకొంది. పరిస్థితి తమ చేతులు దాటిపోతుందనుకున్న యాజమాన్యం పోలీసులు సహకారం తీసుకొని పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చింది. అయినా డార్లింగ్ ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం హడావుడి ఉంటుందిలే అంటున్నారు కొందరు సినీ క్రిటిక్కులు. సోషల్ మీడియాలో కనిపించిన ఇంకో వీడియోలో అయితే మరీ వింత పరిస్థితి.. కొందరు నిజమైన మొసలిని తలపించే బొమ్మలను ఏకంగా థియేటరులోకి పదుల సంఖ్యలో పట్టుకొచ్చేశారు. వాటిని చూసిన ఇతర వీక్షకులకు కాసేపు నిజమైనవేనని కంగారు పడ్డారు. అయితే అవి కాస్త బొమ్మ మొసళ్లు అని తెలిశాక ఊపిరి పీల్చుకున్నారు. ఇంకా నయం థియేటర్లు హార్ట్ పేషంట్లు లేరు కాబట్టి సరిపోయింది.. లేదంటే పరిస్థితి ఏమయ్యేదో అంటున్నారు సినీ విశ్లేషకులు.
మొత్తానికి డార్లింగ్ సినిమాకు మిక్స్ డ్ టాక్ రావడం.. అభిమానుల్లో ఉత్సాహం నింపితే.. ఫ్యాన్స్ వార్ చేయాలనుకునే వారికి మాత్రం కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుగా అయ్యింది. ఏదైతే ఏమి.. కాస్త నెమ్మదిగా ఉండండి డార్లింగ్స్.. మనం ఫ్యాన్స్ కావాలి గానీ న్యూసెన్స్ కావొద్దని అంటున్నారు ప్రజానీకం.
Read More..






