రాజాసాబ్ పార్ట్-2 టైటిల్ ఇదే.. అస్సలు ఊహించి ఉండరుగా..

by Gugulothu.Kavitha |   (  Updated:2026-01-09 07:08:12  IST  )

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో తెరకెక్కిన రాజాసాబ్ మూవీ ఈ రోజు థియేటర్లలో రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటుంది.

రాజాసాబ్ పార్ట్-2 టైటిల్ ఇదే.. అస్సలు ఊహించి ఉండరుగా..
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), డైరెక్టర్ మారుతి(Maruti) కాంబోలో తెరకెక్కిన ‘రాజాసాబ్’(Raja Saab) మూవీ ఈ రోజు థియేటర్లలో రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటుంది. ప్రభాస్ ఫన్ బాడీ లాంగ్వేజ్, ఫైట్స్, డ్యాన్సులు.. ఇలా కలర్ ఫుల్ అవతార్‌లో కనిపించి మెప్పించినప్పటికీ సంజయ్ దత్ పర్సనాలిటీకి ఆ క్యారెక్టర్‌కి డైరెక్టర్ ఇంకా బలంగా రాయాల్సింది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ తెరపై అందంగా కనిపించినప్పటికీ ఆ పాత్రలు కథలో మిళితం కాలేదు.

అంతేకాకుండా ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్, నిర్మాణ విలువలు బాగున్నప్పటికీ డైరెక్షన్స్‌లో లోపాల వల్ల కథ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే రాజాసాబ్ సినిమాకు పార్ట్-2 కూడా ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. పార్ట్-2 టైటిల్‌ను ‘రాజాసాబ్ సర్కస్:1935’గా ఖరారు చేసినట్లు మూవీ ఎండింగ్‌లో వెల్లడించారు. ఈ పార్ట్-2లో ప్రభాస్ జోకర్ లుక్‌లో కనిపించనున్నారు. అయితే ఇది ప్రీక్వెలా లేదా సీక్వల్‌గా తెరకెక్కతుందా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా ట్రైలర్‌లో ప్రభాస్ ఓల్డ్ మ్యాన్ లుక్‌లో కనిపించిన సీన్స్ ఈరోజు రిలీజ్ అయిన సినిమాలో లేవు.. దీన్ని బట్టి చూస్తే అవి నెక్స్ట్ పార్ట్‌లో ఉండనున్నట్లుగా తెలుస్తోంది.

Read More..

ఆ అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోను.. ప్రభాస్ షాకింగ్ కామెంట్స్

Next Story