- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోను.. ప్రభాస్ షాకింగ్ కామెంట్స్
ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం ‘ది రాజాసాబ్’ (The Rajasab)సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం ‘ది రాజాసాబ్’ (The Rajasab)సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. జనవరి 9న గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి ఊపందుకుంటోంది. ఈ సందర్భంలో తాజాగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga)తో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. తన సినిమాల్ని రిలీజ్ రోజున చూడనని, సాధారణంగా ఒక వారం రోజుల తర్వాతే చూస్తానని ప్రభాస్ చెప్పడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఫస్ట్ డే ఫస్ట్ షో ఉత్సాహం మిస్ అవుతావు కదా అని అడిగితే.. ‘‘ఆ రోజు తనకు ఎంజాయ్‌మెంట్ కంటే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది.
సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందన్న టెన్షన్, ప్రేక్షకుల స్పందనపై ఆలోచనలు తనను మానసికంగా ఒత్తిడికి గురిచేస్తాయి. అందుకే ఆ హడావుడి తగ్గిన తర్వాతే సినిమాను రిలాక్స్‌డ్ మైండ్‌తో చూస్తాను. అప్పుడే నా పర్ఫార్మెన్స్‌ను నిజంగా అంచనా వేసుకోగలుగుతాను. ‘KGF 2’ సినిమాతో నాకున్న ఒక మధుర జ్ఞాపకం అదే. థియేటరికల్ ఎక్స్‌పీరియన్స్ అంటూ నా కజిన్స్, ఫ్రెండ్స్ బలవంతంగా తనను ప్రసాద్ ల్యాబ్‌కు తీసుకెళ్లారు. అక్కడ అందరితో కలిసి సినిమా చూసి ఫుల్ ఎంజాయ్ చేశాను. ఆ రోజు ప్రేక్షకుల రెస్పాన్స్, హాలులోని ఎనర్జీ నాకు ఇప్పటికీ గుర్తుంది. అలాంటి అనుభవాలు అరుదుగా వస్తాయి.. నేను దానిని ఎప్పటికీ మర్చిపోను.
అలాగే ‘కల్కి’ సినిమా థియేటర్ అనుభవ సెకండ్ హాఫ్‌లో నాకు, అమితాబ్ బచ్చన్ మధ్య వచ్చే ఫైట్ సీన్ సమయంలో తన కోసం కాకుండా అమితాబ్ సర్ కోసం ప్రేక్షకులు గట్టిగా అరవడం, విజిల్స్ వేయడం చూసి ఆశ్చర్యపోయా. వాళ్లంతా తన కజిన్స్, ఫ్రెండ్స్ అయినా కూడా అమితాబ్ గారి క్యారెక్టర్‌కు కనెక్ట్ అయ్యారని అప్పుడు అర్థమైంది. దీనికి కారణం కూడా ఉంది సినిమాలో తన పాత్ర సెల్ఫిష్ నేచర్‌లో ఉంటే, అమితాబ్ బచ్చన్ గారి పాత్ర పూర్తిగా హీరోయిక్‌గా ఉండటంతో ప్రేక్షకులు సహజంగానే ఆయన వైపే నిలబడ్డారు. ఒక నటుడిగా ఇది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. కథ, క్యారెక్టర్ బలంగా ఉంటే స్టార్‌డమ్‌ను కూడా దాటి ప్రేక్షకులు స్పందిస్తారని అర్థమైంది’’ అని ప్రభాస్ పేర్కొన్నాడు.
Read More..






