- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking News : 'రాజాసాబ్' టికెట్ల రేటు పెంపుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్
అర్థరాత్రి దాటిన తర్వాత టికెట్ల పెంపుకు అధికారిక ఉత్తర్వులు

దిశ, వెబ్ డెస్క్ : రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ సినిమా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ సినిమా టికెట్స్ రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఏపీలో రెండు రోజుల ముందే టికెట్ల రేటు పెంపుకు, ప్రీమియర్ షోలకు అక్కడి ప్రభుత్వం అనుమతినివ్వగా.. తెలంగాణ సర్కారు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ప్రత్యేక షోలకు పర్మిషన్ ఇవ్వకపోయినా మొత్తానికి గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత టికెట్ల పెంపుకు అనుమతి ఇస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో వివిధ యాప్స్ లలో కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. అయితే గురువారం మిడ్ నైట్ వరకు సాధారణ టికెట్ ధరలే ఉండగా.. అర్థరాత్రి దాటిన తర్వాత మాత్రం మల్టీప్లెక్సుల్లో టికెట్ ధర రూ.450, సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో రూ.300 చూపిస్తున్నాయి. చివరి క్షణంలో అయినా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై చిత్ర నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






