మళ్లీ అనారోగ్యానికి గురైన ప్రభాస్.. సినిమా షూటింగ్‌లకు బిగ్ బ్రేక్..!?

by Disha Web Desk 7 |
మళ్లీ అనారోగ్యానికి గురైన ప్రభాస్.. సినిమా షూటింగ్‌లకు బిగ్ బ్రేక్..!?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న ప్రభాస్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌లో దూసుకున్న ప్రభాస్ తదుపరి చిత్రం.. ‘‘ఆదిపురుష్’’ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. సలార్, డైరెక్టర్ మారుతీతో మరొక సినిమా, స్పిరిట్, ప్రాజెక్టుకే వంటి చిత్రాలతో బిజీగా ఉన్నా ప్రభాస్ గత మూడు రోజుల నుంచి అనరోగ్యం భారినపడినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే గతంలో కూడా ఒకసారి ప్రభాస్ ఆరోగ్యంపైన పలు రూమర్స్ వినిపించాయి. దీంతో ఆయన క్లారిటీ ఇచ్చారు.

ఇప్పుడు మళ్లీ ప్రభాస్ ఆరోగ్యంపై నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మెరుగైన వైద్యం కోసం విదేశాలకు వెళ్ళబోతున్నారని ప్రభాస్ సన్నిహితుల నుంచి ఈ వార్తలు వినిపిస్తున్నట్లు సీని ఇండస్ట్రీలో టాక్. అంతే కాకుండా అనరోగ్యం కారణంగా ప్రభాస్ సినిమా షూటింగులకు కూడా బ్రేక్ వేశారని తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వరకూ నిజం ఉందో తెలియదు కాదు.. బాలీవుడ్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ బాలీవుడ్ మీడియా కుట్రపూరితంగానే ఇలాంటి విషయాలను ప్రచారం చేస్తోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ విషయాలపై క్లారిటీ రావలంటే ప్రభాస్ స్పందిచాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి : ఉగాది కానుకగా.. ‘రైటర్ పద్మ భూషన్’ సినిమా ఓటీటీ రిలీజ్


Next Story