- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవర్ స్టార్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ షురూ..సోషల్ మీడియాను షేక్ చేయబోతున్న ఉస్తాద్ అప్‌డేట్
టాలీవుడ్ చరిత్రలో కొన్ని కాంబినేషన్లు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అందులో పవన్ కళ్యాణ్(Pawan Kalyan)- హరీష్ శంకర్ (Harish Shankar)జోడీ ఒకటి.

దిశ, సినిమా: టాలీవుడ్ చరిత్రలో కొన్ని కాంబినేషన్లు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అందులో పవన్ కళ్యాణ్(Pawan Kalyan)- హరీష్ శంకర్ (Harish Shankar)జోడీ ఒకటి. వీరిద్దరి కలయికలో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustad Bhagat Singh) ప్రకటించినప్పటి నుండే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమాను తమిళ్ హిట్ మూవీ ‘తేరి’ ఆధారంగా తెరకెక్కిస్తున్నప్పటికీ, హరీష్ శంకర్ తన మార్క్ మాస్ ఎలివేషన్స్, డైలాగ్స్‌తో కథను పూర్తిగా మార్చేశారని సమాచారం. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా మార్చి 26న విడుదల కావాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల వాయిదా పడినట్లు పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ సినిమాను మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నిజానికి ఆ తేదీన రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా విడుదల కావాల్సి ఉంది.
కానీ ఆ మూవీ వాయిదా పడటంతో ఆ ఖాళీని బాబాయ్ పవన్ కళ్యాణ్ భర్తీ చేయబోతున్నారని తెలుస్తోంది. అంటే మూవీ టీమ్ అనుకున్నట్లుగానే మార్చిలో ఉస్తాద్ థియేటర్స్‌లోకి రాబోతున్నాడన్న మాట. తాజాగా, ఈ విషయంపై చిత్ర బృందం స్పందించి ఒక సాలిడ్ అప్‌డేట్ ఇచ్చింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు సినిమా రిలీజ్ డేట్‌తో పాటు ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా అభిమానులు సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని కోరారు. ఇక అది చూసిన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా పొలిటికల్ పంచ్‌లు, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
దేవి శ్రీ ప్రసాద్ అందించే సంగీతం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందట. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో పవన్ కళ్యాణ్ స్వాగ్ చూసిన అభిమానులు, థియేటర్లలో పూనకాలు రావడం పక్కా అని ఫిక్స్ అయ్యారు. సాయంత్రం 4 గంటలకు వచ్చే అఫీషియల్ అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కౌంట్‌డౌన్ మొదలుపెట్టేశారు. పవన్ కళ్యాణ్ నుంచి ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్టైనర్ వచ్చి చాలా కాలం అవుతుండటంతో, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమనిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో పవర్ స్టార్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.






