శిరీష్ ప్రీ-వెడ్డింగ్ షూట్‌ సెలబ్రేషన్స్.. అక్కడ ఎంజాయ్ చేస్తున్న అల్లు ఫ్యామిలీ..

by I. Sairam |

టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్(Allu Sirish) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

శిరీష్ ప్రీ-వెడ్డింగ్ షూట్‌ సెలబ్రేషన్స్.. అక్కడ ఎంజాయ్ చేస్తున్న అల్లు ఫ్యామిలీ..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్(Allu Sirish) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘గౌరవం’(Gouravam) సినిమాతో హీరోగా పరిచయమైన ఆయన ఆ తర్వాత ‘కొత్త జంట’(Kotha Janta), ‘శ్రీరస్తు శుభమస్తు’(Srirastu Subhamastu), ‘ఒక్క క్షణం’(Okka Kshanam), ‘ఏబీసీడీ’(ABCD), ఊర్వశివో రాక్షసివో, బడ్డీ వంటి సినిమాలు చేశాడు. కానీ అంతగా గుర్తింపును తెచ్చిపెట్టలేకపోయియి. ఇక అతని పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. అల్లు శిరీష్ (Allu Sirish) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్‌లో శిరీష్ నయనికా రెడ్డి (Nayanika Reddy)తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు.

ఇక వీరి వివాహం ఈ ఏడాది మార్చి 6న జరగనుంది. పెళ్లి డేట్ దగ్గర పడుతుండటంతో శిరీష్ - నయనికా వారి బ్యాచిలర్ పార్టీని దుబాయ్‌లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ పేరుతో ఈ పార్టీని నిర్వహించారు. అల్లు బ్రదర్స్ అయిన బాబీ, అల్లు అర్జున్ (Allu Arjun), శిరీష్.. వారి ఫ్రెండ్స్, నయనికా ఫ్రెండ్స్ అందరూ ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప- 2’(Pushpa-2) సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 1500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. పుష్ప- 2 చిత్రం తర్వాత అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ(Atlee) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ AA22xA6 వర్కింగ్​టైటిల్ తో తెరకెక్కుతోంది. ఇక షూటింగ్​పనులు జోరుగా సాగుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపిక పదుకొణె(Deepika Padukone) హీరోయిన్‌గా నటిస్తోంది.

అలాగే తాజాగా తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ మూవీ చేయబోతున్నాడు. ఈ కాంబోలో సినిమాను కన్ఫార్మ్ చేస్తూ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ స్పెషల్ వీడియో గ్లింప్స్​ను మేకర్స్​ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. ఈ సంవత్సరమే ఈ ప్రాజెక్ట్​ పట్టాలెక్కనుంది. ఇది '#AA23' వర్కింగ్ టైటిల్​తో ప్రారంభం కానుంది. ఇక అనిరుధ్‌ రవిచంద్రన్‌(Anirudh Ravichandran) ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.

Next Story