Poonam Kaur: మాజీ ప్రధానిని కలిసిన పూనమ్.. ఎందుకో తెలుసా?

by Mallepaka Hamsa |   (  Updated:2022-08-13 09:46:31  IST  )

Poonam Kaur meets former Prime Minister Manmohan Singh| నటి పూనమ్ కౌర్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. కానీ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులతో తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటుంది. ఇక తాజాగా, 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమె

Poonam Kaur meets former Prime Minister Manmohan Singh
X

దిశ, వెబ్‌డెస్క్: Poonam Kaur meets former Prime Minister Manmohan Singh| నటి పూనమ్ కౌర్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. కానీ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులతో తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటుంది. ఇక తాజాగా, 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమె మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌ను కలిసింది. పూనమ్, కాంగ్రెస్ పార్టీ నేత ఎంపీ శశిథరూర్‌తో కలిసి మన్మోహన్ సింగ్ ఇంటికి వెళ్లారు. ఈ విషయాన్ని స్వయంగా పూనమ్ కౌర్ తన ట్విట్టర్ ద్వారా తెలుపుతూ కొన్ని ఫొటోలను కూడా షేర్ చేసింది.

'' మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌ గారిని గౌరవ పూర్వకంగా కలిశాను. చాలా సంతోషంగా ఉంది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఖాదీ తిరంగాను బహుకరించాను. పాకిస్థాన్ లోని గురుద్వారా దగ్గర తీసుకున్న ప్రత్యేకమైన గులకరాళ్ళ బాక్స్‌ను కూడా గిఫ్ట్‌గా ఇచ్చాను. దానికి ఆయన పేరు పెట్టారు''. అని చెప్పుకొచ్చింది. దీంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ట్రెండ్ అవుతున్న జాక్వెలిన్ బర్త్‌డే వేడుకలు

Next Story