ట్రెండ్ అవుతున్న జాక్వెలిన్ బర్త్‌డే వేడుకలు

by Disha Web Desk 22 |
ట్రెండ్ అవుతున్న జాక్వెలిన్ బర్త్‌డే వేడుకలు
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్‌లోని అందమైన నటీమణులలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒకరు. శ్రీలంక దేశానికి చెందిన ఈమె అందం, నటనతో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. అయితే ఈమె పుట్టిన రోజు వేడుకలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. సాధారణంగా సెలబ్రెటీలు పుట్టిన రోజు వేడుకలు స్నేహితులతో పబ్‌లు, పార్టీలు అంటూ గడుపుతారు. కానీ జాక్వెలిన్ అందుకు బిన్నంగా స్నేహితులతో సరదాగా గడపకుండా తన పుట్టినరోజును భిన్నంగా జరుపుకుంది. జాక్వెలిన్ తన పుట్టిన రోజును సందర్భంగా అస్సాంలోని గౌహతిలో ఉన్న ప్రసిద్ధ కామాఖ్యా దేవి ఆలయాన్ని సందర్శించారు.

ఆమె మొదటిసారిగా ఈ ఆలయానికి వచ్చి అమ్మవారి దర్శించుకున్నారు. ఈ ఆలయాన్ని సందర్శించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు ఇందుకు సంబంధించిన ఫోటోలతో పాటు ఓ వీడియోను జాక్వెలిన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. బర్త్‌డేను ఆవుల కొట్టంలో ఆవులతో గడుపుతున్న ఈ వీడియో వైరల్‌గా మారింది. "నా పుట్టినరోజున అత్యంత సంతోషకరమైన ప్రదేశం ఇదే. నేను ఎప్పటికీ సంతోషకరమైన క్షణాలను కోరుకుంటున్నాను! నా ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అంటూ పోస్ట్ చేసిన వీడియోకు కామెంట్స్ వెల్లువెత్తాయి. అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ నటికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియో 3.9 మిలియన్ల వీక్షణలను సాధించింది.

ఆయనతో జర్నీ ఏదో తెలియని అనుభూతినిచ్చింది : కియారా



Next Story

Most Viewed