భారీ గుడ్‌న్యూస్: బుట్టబొమ్మకు లైఫ్ ఇవ్వబోతున్న సిద్ధు జొన్నలగడ్డ..!!

by Disha Web Desk 9 |
భారీ గుడ్‌న్యూస్: బుట్టబొమ్మకు లైఫ్ ఇవ్వబోతున్న సిద్ధు జొన్నలగడ్డ..!!
X

దిశ, వెబ్‌డెస్క్: కెరీర్ స్టార్టింగ్‌లో అగ్ర హీరోల సరసన నటించి బ్లాక్ బస్టర్ హిట్లు తన ఖాతాలో వేసుకుంది హీరోయిన్ పూజా హెగ్డే. తర్వాత ఈ బ్యూటీకి పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. బుట్టబొమ్మ ఇప్పుడిప్పుడే ఫామ్‌లోకి వస్తుంది. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న ఓ సినిమాలో నటించబోతుందని సమాచారం. అలాగే నాని హీరోగా ఓజీ డైరెక్టర్ సుజిత్ ఓ మూవీ చేయబోతున్నారు. ఇందులో కూడా పూజాను కథానాయికగా ఎంపిక చేసుకునే ప్లాన్ లో ఉన్నారట. ఈ క్రమంలో పూజాకు మరో ఆఫర్ వచ్చినట్లు నెట్టింట ఓ వార్త దుమారం రేపుతోంది. యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన ‘డీజే టిల్లు, టిల్లు స్వ్కేర్’ బాక్సాఫీసును ఏ రేంజ్ లో షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ గా నిలవడంతోమరో సీక్వెల్ తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. టిల్లు క్యూబ్ పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. కాగా కథానాయికగా బుట్టబొమ్మను సెలక్ట్ చేసే ప్లానింగ్‌లో ఉన్నారట మూవీ టీమ్. టిల్లు సినిమాతో బుట్టబొమ్మ దశ తిరగనుందా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా ా మారింది.

Read More..

ఆస్పత్రిలో చేరిన ప్రముఖ కమెడియన్.. కన్నీరు పెడుతూ వీడియో!

Next Story

Most Viewed