బెంగాల్ లో బీజేపీ రోడ్ షో లో రాళ్ల దాడి.. ఘర్షణ

by Shamantha N |
బెంగాల్ లో బీజేపీ రోడ్ షో లో రాళ్ల దాడి.. ఘర్షణ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల వేళ బెంగాల్ లో మరోసారి హింసాత్మక ఘటనలు జరిగాయి. బీజేపీ నేత, నటుడు మిథున్ చక్రవర్తి రోడ్ షోలో రాళ్ల దాడి జరిగింది. మిడ్నాపూర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్ తరఫున మిథున్ రోడ్ షో చేపట్టారు. అయితే, రోడ్ షో జరుగుతుండగా కొందరు రాళ్లదాడి చేపట్టారు. అయితే, ఈ దాడిలో మిథున్ చక్రవర్తికి ఏం కాలేదని పోలీసులు తెలిపారు.

మిడ్నాపుర్‌ కలెక్టరేట్‌ దగ్గర రోడ్ షో ప్రారంభం అయ్యింది. వందలాది మంది బీజేపీ కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. మిథున్ చక్రవర్తి, అగ్నిమిత్రలు వెళ్తున్న వాహనంపైకి కొందరు రాళ్లు, బాటిళ్లు విసిరారు. బీజేపీ కార్యకర్తలు ఎదురుదాడి చేయడంతో అక్కడ ఘర్షణ చెలరేగింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు పరిస్థితిని వెంటనే అదుపులోకి తీసుకొచ్చారు.

టీఎంసీ కార్యకర్తలే ఈ దాడి చేశారని బీజేపీ ఎంపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్ ఆరోపించారు. బీజేపీకి మద్దతు పెరుగుతుందని భయంతోనే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. టీఎంసీకి చెందిన వారే హింసకు పాల్పడ్డారని విమర్శించారు. బీజేపీ చేసిన ఆరోపణలను కొట్టిపారేసింది టీఎంసీ. ఇలాంటి నీచ చర్యలకు తాము పాల్పడమని పేర్కొన్నారు టీఎంసీ అధికార ప్రతినిధి త్రినాంకుర్ భట్టాచార్య. రోడ్ షో ఫ్లాప్ అవడంతోనే బీజేపీ ఇలాంటి డ్రామాలు చేస్తుందని మండిపడ్డారు.

Next Story