- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Payal Rajput: పెళ్లి కాకుండానే పాయల్ ప్రెగ్నెంట్.. బేబీ బంప్ వీడియో షేర్ చేయడంతో అంతా షాక్!
పాయల్ రాజ్‌పుత్ ఇన్‌స్టాగ్రామ్‌లో తాను గర్భవతిగా ఉన్నట్లు కనిపిస్తున్న ఒక వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె బేబీ బంప్‌తో ఎంతో సంతోషంగా డాన్స్ చేస్తూ కనిపించింది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో ఓవర్‌నైట్ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో తన హాట్ అందాలతో, నటనతో కుర్రకారు గుండెల్లో మంటలు రేపిన ఈ భామ, ఆ తర్వాత ‘వెంకీ మామ’, ‘మంగళవారం’ వంటి చిత్రాలతో మంచి విజయాలను అందుకుంది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న పాయల్, తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట పెద్ద దుమారాన్నే రేపుతోంది. పాయల్ రాజ్‌పుత్ ఇన్‌స్టాగ్రామ్‌లో తాను గర్భవతిగా ఉన్నట్లు కనిపిస్తున్న ఒక వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె బేబీ బంప్‌తో ఎంతో సంతోషంగా డాన్స్ చేస్తూ కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. "పెళ్లి కాకుండానే పాయల్ ప్రెగ్నెంట్ అయిందా?" అంటూ సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. అయితే, ఆ వీడియోకు ఆమె జత చేసిన క్యాప్షన్ చూశాక కానీ అసలు విషయం అర్థం కాలేదు.ఆ వీడియోకు పాయల్ “గర్భవతినే, కానీ గర్భవతిని కాదు” అనే వెరైటీ క్యాప్షన్ ఇచ్చింది.
అంటే అది నిజ జీవితంలో ప్రెగ్నెన్సీ కాదని, ఏదో సినిమా షూటింగ్ కోసం వేసిన గెటప్ అని స్పష్టమైంది. పాయల్ ప్రస్తుతం ‘వెంకటలచ్చిమి’ అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తోంది, బహుశా ఆ సినిమా కోసమే ఈ లుక్ అని తెలుస్తోంది. నిజం తెలిశాక అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. పాయల్ చేసిన ఈ ప్రెగ్నెన్సీ ప్రాంక్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె లుక్ చాలా బ్యూటీఫుల్‌గా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తుంటే, మరికొందరు మాత్రం ఇలాంటి విషయాల్లో జోకులు వేయకూడదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. "సడెన్‌గా చూసి నిజమే అనుకున్నాం.. ఇలా భయపెట్టకు పాయల్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో ఇప్పుడు మీమ్స్ రూపంలో విపరీతంగా వైరల్ అవుతోంది. కెరీర్ పరంగా పాయల్ ఇప్పుడు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. తన ప్రియుడు సౌరభ్ ధింగ్రను వెండితెరకు హీరోగా పరిచయం చేస్తూ ఒక సినిమా చేస్తోంది. ఇందులో పాయల్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తోంది. అటు పర్సనల్ లైఫ్, ఇటు ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ పాయల్ దూసుకుపోతోంది.






