స్టార్‌డమ్ కోసం తప్పుడు నిర్ణయాలు తీసుకోను.. డబ్బుకు ఆశపడితే పశ్చాత్తాపం జీవితాంతం ఉండిపోయేది : గౌరి కిషన్

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-06 08:46:52  IST  )

ఒకసారి కేవలం డబ్బు ఆశ చూపి నాకు ఒక చిన్న పాత్రను ఆఫర్ చేశారు. ఆ డబ్బు తీసుకుంటే అప్పటికి బాగుండేదేమో కానీ, ఆ పాత్ర చేసినందుకు కలిగే పశ్చాత్తాపం నా జీవితాంతం ఉండిపోయేది.

స్టార్‌డమ్ కోసం తప్పుడు నిర్ణయాలు తీసుకోను.. డబ్బుకు ఆశపడితే పశ్చాత్తాపం  జీవితాంతం ఉండిపోయేది : గౌరి కిషన్
X

దిశ, సినిమా: తమిళ చిత్రం ‘96’లో త్రిష (జాను) చిన్నప్పటి పాత్రతో కుర్రకారు మనసు గెలుచుకున్న నటి గౌరి కిషన్. కేవలం ఆ ఒక్క సినిమాతోనే ఓవర్‌నైట్ స్టార్‌డమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉంది. తెలుగులో ‘జాను’ సినిమాలో సమంత చిన్నప్పటి వెర్షన్ పోషించి మెప్పించిన గౌరి, గతేడాది ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. సినిమాల్లో నటిస్తూనే, వ్యక్తిగత జీవితంలో తనపై వచ్చే విమర్శలకు ధైర్యంగా సమాధానమిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌరి తన కెరీర్ ఎదుగుదల, సినిమాల ఎంపిక గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. "నాకు నచ్చని విషయాలకు కాదు అని చెప్పడానికి నేను ఎప్పుడూ వెనుకాడను. నా ప్రతి ‘‘కాదు’’ వెనుక ఒక బలమైన కారణం ఉంటుంది" అని ఆమె స్పష్టం చేసింది.

గౌరి తన అనుభవాన్ని వివరిస్తూ.. "ఒకసారి కేవలం డబ్బు ఆశ చూపి నాకు ఒక చిన్న పాత్రను ఆఫర్ చేశారు. ఆ డబ్బు తీసుకుంటే అప్పటికి బాగుండేదేమో కానీ, ఆ పాత్ర చేసినందుకు కలిగే పశ్చాత్తాపం నా జీవితాంతం ఉండిపోయేది. అందుకే ఆ సినిమాకు నిర్మొహమాటంగా ‘నో’ చెప్పాను. డబ్బు కంటే కూడా చేసే పాత్రకు విలువ ఉండాలని నేను నమ్ముతాను" అని చెప్పింది. స్టార్‌డమ్ కోసం తప్పుడు నిర్ణయాలు తీసుకోనని, తనకు నచ్చిన, తన కెరీర్‌కు ఉపయోగపడే ప్రాజెక్టులనే ఎంచుకుంటానని గౌరి పేర్కొంది. తాను ఎక్కడున్నా, ఎంతమందిలో ఉన్నా తన మనసులోని మాటను నిర్భయంగా బయటపెడతానని, తనను తక్కువ చేసి చూసే వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని ఈ చిన్నది నిరూపించింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Payal Rajput: పెళ్లి కాకుండానే పాయల్ ప్రెగ్నెంట్.. బేబీ బంప్ వీడియో షేర్ చేయడంతో అంతా షాక్!

Next Story